హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమర్జెన్సీ కూడా బంద్: జూడాల హెచ్చరిక(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత కొద్దిరోజుల నుంచి జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె మున్ముందు మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

ఇప్పటికే శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం నిర్వహించేందుకు సర్కారు ఇచ్చే అరకొర వసతుల కిట్‌లతో ప్రదర్శన నిర్వహించిన వైద్యులు శనివారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసి క్రాస్‌రోడ్స్, గాంధీనగర్‌ల మీదుగా ఇందిరాపార్కు వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రోగులకు వైద్యం అందించేందుకు తాము చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించేందుకు అనుకూలమైన సౌకర్యాలు, సామాగ్రిని కేటాయించటం లేదని ఆరోపించారు.

జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్లు

ఈ మేరకు స్పందించిన జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను నేరవేర్చటంలో, సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.

జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్లు

ప్రభుత్వానికి మరో ఇరవై నాలుగు గంటల సమయమిస్తున్నట్లు తెలిపారు. లేని పక్షంలో అత్యవసర సేవలను కూడా నిలిపివేసేందుకు తాము వెనకాడబోమని పలువురు వైద్యులు తేల్చి చెప్పారు.

జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్లు

ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రులైన గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు చెందిన జూనియర్ వైద్యులు తమ డిమాండ్ల సాధనం కోసం శనివారం ర్యాలీ నిర్వహించారు.

 జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్లు

ఈ ర్యాలీలో సర్కారుకు ఇరవై నాలుగు గంటల గడువును విధించటం పట్ల ఇప్పటికే ఈ ఆస్పత్రిల్లో ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగుల సహాయకుల్లో ఆందోళన రెట్టింపయ్యింది.

జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్లు

కానీ ఉస్మానియా ఆస్పత్రిలో అప్పటికపుడు వైద్యులను చూపించుకుని వెళ్లిపోయే ఔట్ పేషెంటు విభాగంలోని రోగులకు పెద్దగా సమస్యలు తలెత్తకపోయినా, ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగుల్లో సమ్మె ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది.

జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్లు

ఈ క్రమంలో శనివారం నాటి వైద్యుల ర్యాలీలో అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని ప్రకటించటంతో కిలోమీటర్ల దూరం నుంచి నగరానికొచ్చి చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే చెప్పవచ్చు.

జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్లు

ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, తగిన చర్యలు చేపట్టే దిశగా అధికారులు దృష్టి సారించారు.

జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో రోగుల పరిస్థితిని తెలుసుకునేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించారు.

 జూనియర్ డాక్టర్లు

జూనియర్ డాక్టర్లు

వైద్యుల సమ్మె ప్రభావం రోగులపై ఎంత వరకు ఉందన్న విషయాన్ని ఆయన అధికారులతో చర్చించారు. అనంతరం చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నేరుగా ఆయనే పరీక్షించారు.

English summary
Photos of junior doctors strike continues in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X