వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేసీఆర్! పద్ధతి మార్చుకో, చెబితే విను' (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రజలు తిరగబడక ముందే పద్ధతులు మార్చుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును మంగళవారం హెచ్చరించారు.

ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం కానీ ప్రజలకు పాలకుల వల్ల ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు.

అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చేసిందే వేదం అంటే కుదరదన్నారు. ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చిన తాము బంగారు తెలంగాణ చేయడంలోనూ బాధ్యతగా పని చేస్తామన్నారు.

 పొన్నాల

పొన్నాల

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పాలనానుభవం లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

 పొన్నాల

పొన్నాల

తాము సలహాలు ఇస్తే వాటిని రాజకీయంగా చూస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

పొన్నాల

పొన్నాల

మంత్రులు స్థాయి మరిచి మాట్లాడడం తగదని అన్నారు. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు 25 శాతం తొలుత ఇస్తామంటున్నారని విమర్శించారు.

 పొన్నాల

పొన్నాల

తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇందు కోసమేనా, ఇదేనా బంగారు తెలంగాణ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

 పొన్నాల

పొన్నాల

ఫాస్ట్ పథకం, నెంబర్ ప్లేట్ల వ్యవహారంలాంటి ఎన్నో విషయాల్లో కోర్టు ప్రభుత్వాన్ని మందలించిందని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

 పొన్నాల

పొన్నాల

మెట్రో భూముల విషయంలో వివాదం చెలరేగినందును ముఖ్యమంత్రి కెసిఆర్ వాటిని సరి చేసి స్పష్టత ఇవ్వాలని పొన్నాలడిమాండ్ చేశారు.

 పొన్నాల

పొన్నాల

తాము అధికారంలో ఉన్నప్పుడు ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్ధి గేమింగ్ పార్కు నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Photos of Ponnala Laxmaiah, President along with Congress Leaders addressing Media at Gandhi Bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X