వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశానికే ఆదర్శం: వాటర్‌గ్రిడ్‌పై సిఎం అఖిలేష్, కెటిఆర్‌కు ములాయం మెచ్చుకోలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

లక్నో: ఇంటింటికి తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వాటర్‌గ్రిడ్ పథకం దేశంలోని వివిధ రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆహ్వానం మేరకు పంచాయతీరాజ్ మంత్రి కె తారక రామారావు బృందం గురువారం లక్నో వెళ్లి అఖిలేష్ యాదవ్‌కు ఈ ప్రాజెక్టు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

తెలంగాణ స్ఫూర్తితో ఇదే తరహాలో బుందేల్ ఖండ్‌లో తాగునీటి పథకాన్ని ప్రారంభించనున్నట్టు అఖిలేష్ తెలిపారు. దీనికి సాంకేతిక సహాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. తమ ఇంజనీర్లతో కలిసి వాటర్‌గ్రిడ్ పథకాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు త్వరలో తెలంగాణలో పర్యటించనున్నట్టు అఖిలేష్ తెలిపారు.

తెలంగాణ తాగునీటి పథకం భారత దేశానికే ఆదర్శమని ఆయన ప్రశంసించారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కోట్లాది మంది దాహాన్ని తీర్చేందుకు బృహత్ పథకాన్ని మొదలు పెట్టారని అన్నారు. కెటిఆర్ వాటర్‌గ్రిడ్ గురించి అఖిలేష్‌కు వివరిస్తూ 18 ఏళ్ల కిందట సిద్దిపేటలో కెసిఆర్ ప్రారంభించిన తాగునీటి పథకమే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు స్ఫూర్తి అని తెలిపారు.

వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో పరిశ్రమల అవసరాల కోసం 10శాతం నీటిని కేటాయించినట్టు చెప్పారు. వాటర్ గ్రిడ్ కోసం వేస్తున్న పైప్‌లైన్లతోనే సైబర్ కేబుల్స్ వేసి ఇంటింటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇస్తామని కెటిఆర్ వివరించారు. ప్రాజెక్టుకు ఆర్థిక వనరుల గురించి అఖిలేష్ యాదవ్ ప్రశ్నించగా, హడ్కో, నాబార్డ్‌తోపాటు దేశంలోని ప్రఖ్యాత బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చాయని కెటిఆర్ తెలిపారు.

ప్రాజెక్టు ఫైనాన్షియల్ మోడల్ అచరణాత్మకంగా ఉందని, దాన్ని తమకు పంపించాలని కేంద్ర తాగునీటి శాఖ జాయింట్ సెక్రటరీ సత్యభ్రత సాహూ అడిగిన విషయాన్ని కెటిఆర్ వివరించారు. సమావేశం అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు త్వరలోనే తమ రాష్ట్రంలో ప్రారంభిస్తామని తెలిపారు.

అఖిలేష్‌తో కెటిఆర్

అఖిలేష్‌తో కెటిఆర్

ఇంటింటికి తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వాటర్‌గ్రిడ్ పథకం దేశంలోని వివిధ రాష్ట్రాలను ఆకర్షిస్తోంది.

అఖిలేష్‌తో కెటిఆర్

అఖిలేష్‌తో కెటిఆర్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆహ్వానం మేరకు పంచాయతీరాజ్ మంత్రి కె తారక రామారావు బృందం గురువారం లక్నో వెళ్లి అఖిలేష్ యాదవ్‌కు ఈ ప్రాజెక్టు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

అఖిలేష్‌తో కెటిఆర్

అఖిలేష్‌తో కెటిఆర్

తెలంగాణ స్ఫూర్తితో ఇదే తరహాలో బుందేల్ ఖండ్‌లో తాగునీటి పథకాన్ని ప్రారంభించనున్నట్టు అఖిలేష్ తెలిపారు. దీనికి సాంకేతిక సహాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు.

అఖిలేష్‌తో కెటిఆర్

అఖిలేష్‌తో కెటిఆర్

తమ ఇంజనీర్లతో కలిసి వాటర్‌గ్రిడ్ పథకాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు త్వరలో తెలంగాణలో పర్యటించనున్నట్టు అఖిలేష్ తెలిపారు.

అఖిలేష్‌తో కెటిఆర్

అఖిలేష్‌తో కెటిఆర్

తెలంగాణ తాగునీటి పథకం భారత దేశానికే ఆదర్శమని ఆయన ప్రశంసించారు.

యువకుడైన కెటిఆర్ పనితీరు అద్భుతంగా ఉందని, ఆయన ఆలోచనల్లో దార్శనికత, నిజాయితీ కనిపించిందని అఖిలేష్ అభినందించారు. కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో తెలంగాణ ఎన్నో మైలురాళ్లు అందుకుంటుందనే విశ్వాసం తనకు ఉందని అఖిలేష్ తెలిపారు. సమావేశంలో ఉత్తర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, జల్ నిగమ్ ఎండి, తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, మంత్రి కేటీఆర్ బృందానికి యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ విందు ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే అక్కడకు వచ్చిన సమాజ్‌వాదీపార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య జాతీయ రాజకీయాల గురించి చర్చ జరిగింది.

యువకుడైన మంత్రి కేటీఆర్ చొరవ, మాటతీరు, దేశ రాజకీయాలపై ఆయనకున్న అవగాహన చూసి ములాయంసింగ్ ముగ్ధుడయ్యారు. తెలంగాణ ప్రజలకు మంచి చేయడానికి కేటీఆర్ తాపత్రయపడుతున్నారని ములాయం మెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ కీలకశక్తిగా ఎదగడం ఖాయమని ములాయంసింగ్ ఆశీర్వదించారు.

English summary
Uttar Pradesh chief minister Akhilesh Yadav has praised the prestigious scheme of Water Grid project initiated by Telangana government.The chief minister while talking to Telangana panchayati Raj minister KTR over phone said that, this Water Grid project meant for providing drinking water is becoming an inspiration to all states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X