టిఆర్ఎస్ సమావేశానికి వెళ్తున్నానని, అనంత లోకాలకు టెక్కీ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) షామీర్‌పేటలోని సమావేశానికి వెళ్తున్నానని చెప్పి బుధవారం ఉదయం ఐదు గంటలకు టెక్కీ రాకేష్ రెడ్డి కీసరలోని తన నివాసం నుంచి వెళ్లిపోయాడు. చివరకు జవహర్ నగర్‌లో శవమైన కనిపించాడు. రెండేళ్ల క్రితం యుకె నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఉద్యోగం ఏదీ చేయడం లేదు. స్టాక్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

హరీష్ అనే మిత్రుడి ఇంట్లో రాకేష్ రెడ్డి మృతదేహం బయటపడింది. అతను కడప జిల్లాకు చెందినవాడు. శ్రీధర్ రెడ్డి, హరీష్, రాకేష్ రెడ్డి మంచి మిత్రులు. వీరు ముగ్గురు తరుచుగా ఇక్కడే కలుసుకుంటారు. రాకేష్ రెడ్డి మరణించిన సమయంలో హరీష్ కడపలో ఉన్నాడు. పోలీసులు రాకేష్ రెడ్డి మిత్రుడు శ్రీధర్ రెడ్డిని, బావ మహేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

మహేందర్ రెడ్డికి భార్యతో గొడవలున్నాయి. మహేందర్ రెడ్డిపై రాకేష్ రెడ్డి కుటుంబం వరకట్నం వేధింపుల కింద మెదక్ జిల్లాలోని సిద్ధిపేటలో కేసు పెట్టారు. బుధవారం ఉదయం ఐదున్నర నుంచి ఏడున్నర గంటల మధ్య రాకేష్ రెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. రాకేష్ రెడ్డి బైక్ ఏమైందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శునకాన్ని రంగంలోకి దించగా అది వైన్ షాప్‌కు ఆనుకుని ఉన్న పర్మిట్ రూం వరకు వెళ్లింది.

కిడ్నాపర్ల ప్లాన్ అది కాదట..

కిడ్నాపర్ల ప్లాన్ అది కాదట..

నిజానికి కిడ్నాపర్లు రాకేష్ రెడ్డిని కాకుండా ఆయన సోదరిని కిడ్నాప్ చేయాలని వ్యూహ రచన చేసినట్లు అనుమానిస్తున్నారు. రాకేష్ రెడ్డిని కిడ్నాప్ చేశామని ఆగంతకులు ఆయన ఫోన్ నుంచే తండ్రి బాల్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత మరోసారి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఫోన్ చేసి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు.

బ్యాంకులో డిపాజిట్ చేయాలని..

బ్యాంకులో డిపాజిట్ చేయాలని..

తాము అడిగిన డబ్బులను ఐసిఐసిఐ బ్యాంకులో డిపాజిట్ చేయాలని రాకేష్ తండ్రి బాల్ రెడ్డికి కిడ్నాపర్లు చెప్పారు. అయితే, తన వద్ద డబ్బులు లేవని బాల్ రెడ్డి చెప్పారు. పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు..

అన్ని కోణాల్లో దర్యాప్తు..

రాకేష్ రెడ్డి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ముగ్గురు వ్యక్తులను విచారించామని పోలీసులు చెప్పారు. అసలు టిఆర్ఎస్ సమావేశమే షామీర్ పేటలో లేదని పోలీసు విచారణలో తేలింది. రాకేష్ రెడ్డి సమావేశానికి వెళ్తున్నానని ఎందుకు చెప్పాడో తెలియడం లేదు.

ఇప్పుడే కష్టం

ఇప్పుడే కష్టం

రాకేష్ రెడ్డి హత్య కేసులో నిర్ధారణలకు ఇప్పుడే రాలేమని పోలీసులు చెబుతున్నారు. అనుమానితులు చెబుతున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని వారంటున్నారు గత కొంత కాలంగా రాకేష్ రెడ్డి డిప్రెషన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+