వాళ్లందరికీ వందనాలు: హైదరాబాద్ విలీనంపై మోడీ

హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ విలీనానికి కృషి చేసినవారికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. గురువారం రాత్రి ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం కోసం త్యాగాలు చేసినవారికి ఆయన వందనాలు అర్పించారు.

హైదరాబాదు విలీనం కోసం కృషి చేసి సర్దార్ పటేల్ ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం జరిగిన సందర్భంలో భారత ఐక్యత కోసం ప్రాణాలను త్యాగం చేసినవారందరికీ వందనాలు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

PM hails those who helped in merger of Hyderabad with Union

హైదరాబాద్ ద్వారానే భారతదేశంలో విలీన ప్రక్రియ సంపూర్ణమైందని, ఈ విషయంలో సర్దార్ పటేల్ ఆదర్శప్రాయమైన పాత్ర పోషించారని ఆయన అన్నారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం ఆధీనంలోని హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది.

కేంద్ర హోం మంత్రిగా హైదరాబాద్‌పై సైనిక దాడికి సర్దార్ వల్లబ్ పటేల్ ముందడుగు వేశారు. దాంతో భారత సైన్యాలు హైదరాబాద్ రాజ్యంపై దాడి చేసి ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+