బీజేపీ ఆపరేషన్ తెలంగాణ, రంగంలోకి ప్రధాని మోదీ..!!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల కేంద్రం గా త్రిముఖ పోటీ సాగుతున్న వేళ మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త పార్టీని ప్రకటించారు. కాగా.. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి చేసుకుంటున్న బీజేపీ నెక్స్ట్ టార్గెట్ గా దక్షిణాది పైన గురి పెట్టింది. అందులో భాగంగా కర్ణాటక, తమిళనాడు లక్ష్యంగా కీలక అడుగులు వేస్తోంది. తెలంగాణ కేంద్రంగా ప్రధాని మోదీ కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.

బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడి కానున్నాయి. దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ఆపరేషన్ తెలంగాణ ప్రారంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అధినాయకత్వం దిశా నిర్దేశం చేసింది. ఈ మేరకు కొత్త అడుగుల దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తమకు అనుకూలం గా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక..ముందుగా రాష్ట్రం కోసం కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాల గురించి ప్రజలకు వివరిస్తూనే.. కొత్తగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ప్రధాని మోదీ తో సహా కేంద్ర మంత్రులు తరచూ తెలంగాణలో పర్యటనకు వీలుగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ముందుగా ప్రధాని మోదీ వచ్చే నెల మొదటివారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు.

అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి పై గవర్నర్ కీలక నిర్ణయం, ఇక..!!
అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి పై గవర్నర్ కీలక నిర్ణయం, ఇక..!!
pm-modi-is-likely-to-visit-hyderabd-in-the-first-week-of-may-to-inaugurate-several-development-proj

తెలంగాణ పై స్పెషల్ ఫోకస్

ప్రధాని పర్యటన దాదాపు ఖరారైందని, ఏ రోజు వస్తారన్నది స్పష్టత రావాల్సి ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మోదీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా కొన్ని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం జింఖానా గ్రౌండ్సులో నిర్వహించే బహిరంగసభలో ప్రధాని పాల్గొంటారు. తాజాగా పార్టీ నేతలు గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు ప్రధాని పర్యటన ఏర్పాట్లపైనా చర్చించారు. ఈ పర్యటన వేళ పార్టీ నేతలతోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది. 2028 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ తెలంగాణ కొనసాగించాలని డిసైడ్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+