హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అంటున్నారు: కేసీఆర్, నేను మీ చిన్నమ్మను: సుష్మా హైదరాబాద్‌పై మోడీ

హెచ్ఐసీసీలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షురాలు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వేర్వేరుగా బయలుదేరారు.

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

Global Entrepreneurship Summit : Ivanka Trump reached HICC, Video

హైదరాబాద్: హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంకా ట్రంప్ మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు, మోడీ, ఇవాంకాలు వేర్వేరుగా ప్రాంగణానికి చేరుకున్నారు. కాసేపు ఇద్దరు భేటీ అయ్యారు. ఇరుదేశాల విదేశాంగ శాఖ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

చదవండి: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ మరిన్ని కథనాలు

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం సదస్సు ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సదస్సుకు తొలిసారిగా 52 శాతం మంది మహిళా డెలిగేట్స్ వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ జీఈఎస్ సదస్సులో ప్రారంభోపన్యాసం చేశారు. తర్వాత ఇవాంకా, ఆ తర్వాత ప్రధాని మోడీ మాట్లాడారు.

పెట్టుబడిదారులు తెలంగాణను కోరుకుంటున్నారు

పెట్టుబడిదారులు తెలంగాణను కోరుకుంటున్నారు

దేశంలో తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని కేసీఆర్ అన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇప్పుడు తెలంగాణనే కోరుకుంటున్నాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు అందరికీ స్వాగతం అన్నారు.

హైదరాబాదులో గొప్ప సంస్థలు

హైదరాబాదులో గొప్ప సంస్థలు

ప్రపంచంలోని 5 గొప్ప సంస్థలు హైదరాబాదులో తమ కేంద్రాలను నెలకొల్పాయని కేసీఆర్ చెప్పారు. టీఐపాస్ పేరుతో కొత్త పాలసీని రూపొందించామని చెప్పారు. 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 5400కు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. గూగుల్, యాపిల్ వంటి సంస్థలు వచ్చాయని చెప్పారు.

హైదరాబాద్ టెక్నాలజీకే కాదు, సంబంధాలకు ప్రతీక

ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. హైదరాబాద్ టెక్నాలజీకే కాదని, భారత్-అమెరికా సుధృఢమైన సంబంధాలకు ప్రతీక అని అన్నారు. ఈ సదస్సుకు ఆతిథ్యం వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఝాన్సీలక్ష్మీబాయి లాంటి వీరమణులు మనకు ఆదర్శమని చెప్పారు.

సానియా, సింధు, సైనా భారత్ గర్వపడేలా చేశారు

దక్షిణాసియాలో ఈ సదస్సు ఇదే తొలిది అని మోడీ అన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా మహిళల పాత్ర మరువలేనిదని చెప్పారు. జీఈ సదస్సుకు హాజరైనందుకు ఇవాంకా ట్రంప్‌కు కృతజ్ఞతలు అన్నారు. అంతరిక్ష పరిశోధనల్లోను మహిళా శాస్త్రవేత్తల సేవలు అమోఘమన్నారు.
హైదరాబాదు నుంచి వచ్చిన సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జాలు భారత దేశం గర్వపడేలా చేశారని చెప్పారు. మహిళా క్రీడాకారులు దేశానికి గర్వకారణం అని చెప్పారు.

పురాణాల్లో మహిళలు శక్తికి ప్రతీకలు

భారత పురాణాల్లో మహిళలు శక్తికి ప్రతీకలు అన్నారు. ఎంటర్‌ప్రెన్యూయర్స్‌ను, ఇన్వెస్టర్లను ఒకే వేదిక పైకి తీసుకు రావడం ఈ సదస్సు ఉద్దేశ్యమని చెప్పారు. మహిళలు దృఢనిశ్చయంతో పని చేస్తారని చెప్పారు. గుజరాత్ పాడిపరిశ్రమలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యల వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ర్యాంకింగ్ మెరుగుపడిందని చెప్పారు.

ఆయుర్వేద, యోగాలను ప్రపంచానికి అందించిన భారత్

ఆయుర్వేద, యోగాలను ప్రపంచానికి అందించిన భారత్

భారత చరక సంహిత ప్రపంచానికి ఆయురద్వేదాన్ని పరిచయం చేసిందని మోడీ చెప్పారు. యువ ఎంటర్‌ప్రెన్యూయర్స్‌ను ప్రోత్సహించడంలో ముద్రా బ్యాంక్ తోడ్పడుతుందని చెప్పారు. మన సంస్కృతిలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పేందుకు శక్తిని ఆరాధించడమే నిదర్శనం అన్నారు. ఆయుర్వేదం, యోగాలు ప్రపంచానికి భారత్ అందించాయన్నారు.

సున్నా, దశాంశ మానము మన విజ్ఞానానికి నిదర్శనం

సున్నా, దశాంశ మానము మన విజ్ఞానానికి నిదర్శనం

గతంలో బ్యాంకులకు దూరంగా ఉన్న వారిని జన్ ధన్ యోజన ద్వారా దగ్గరగా తీసుకు వచ్చామని మోడీ చెప్పారు. 2018 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామానికి విద్యుత్ ఇచ్చేలా చూస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అనేక పాత చట్టాలను చెత్తబుట్టలో వేశామన్నారు. దశాంశ మానము, సున్నా ఆవిష్కరణలు భారత విజ్ఞానానికి నిదర్శనం అన్నారు. కల్పనా చావ్లా, సునితా విలియమ్స్ భారత్ మేథో శక్తికి నిదర్శనం అన్నారు.

తెలంగాణ ప్రజలకు చిన్నమ్మను

తెలంగాణ ప్రజలకు తాను చిన్నమ్మను అని కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. హైదరాబాదులోని హెచ్ఐసీసీ సదస్సులో ఆమె మాట్లాడారు. సదస్సుకు హైజరైన వారందరికీ ధన్యవాదాలు అన్నారు.

English summary
Prime Minister Narendra Modi and Ivanka Trump reached HICC on Tuesday afternoon for Global Entrepreneurship Summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X