హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆగస్టు 7 ప్రపంచ స్నేహితుల దినోత్సవం. అదే రోజు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ ఆసక్తికర చర్చ వచ్చింది.

ఆగస్టు 7న మోడీ తెలంగాణకు వస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహాన్ని మోడీ కోరుకుంటున్నందు వల్లే ఆయన ఆరోజు తన తెలంగాణ పర్యటనను ఖరారు చేసుకున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఓ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిశితంగా పరిశీలిస్తే అవుననే అనుమానం కలుగుతోంది.

రాష్ట్రం ఏర్పడిన తరువాత మోడీ ఇప్పటి వరకు తెలంగాణలో అడుగు పెట్టలేదని పలు సందర్భాల్లో టిఆర్‌ఎస్ విమర్శలు చేస్తూనే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీపై ప్రధానంగా ఈ అంశంపైనే టీఆర్ఎస్ ఘాటు విమర్శలు కూడా చేసింది. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీకి సహకరించినా, మోడీ మాత్రం తెలంగాణపై ఇప్పటివరకు బహిరంగంగా సానుకూలత వ్యక్తం చేయలేదు.

అంతేనా... 2014 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ బలవంతంగా తల్లీబిడ్డను వేరు చేశారంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీలో ప్రత్యేకహోదా అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో మోడీ తెలంగాణ పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని బీజేపీపై అధికారంలో ఉన్న టీడీపీ విమర్శలు ఎక్కుపెట్టిన సమయంలో మోడీ తెలంగాణ పర్యటనలో ఇచ్చే హామీలు, చేసే ప్రకటనలపై రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పలు హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని తెలంగాణ నాయకత్వం ఇప్పటి వరకు విమర్శిస్తూ వచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని మోడీ గజ్వేల్‌లో ప్రారంభించనున్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించింది. నీతి ఆయోగ్ సైతం అన్ని రాష్ట్రాలకు ఈ పథకాన్ని పరిశీలించాలని, తమతమ రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది.

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం ఈ పథకంపై ఆసక్తి చూపడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనే ఈ పథకాన్ని ప్రధానితో ప్రారంభోత్సవం చేయించాలని నిర్ణయించారు. గజ్వేల్‌లో ఈ పథకాన్ని ప్రారంభించి తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని, పథకాలను ప్రధాని మోడీకి వివరించనున్నారు.

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో టిఆర్‌ఎస్‌పై బీజేపీ నేతగా విమర్శలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణకు సంబంధించి హామీలను అమలు చేయమని డిమాండ్ చేయడం మినహా ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రధానమంత్రిపై, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయలేదు.

 చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

ఒకవైపు రాష్ట్రంలో ఎంఐఎంతో స్నేహాన్ని కొనసాగిస్తూనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉంటున్నారు. అంశాల వారీగా మద్దతు ఇస్తాం, అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒత్తిడి తీసుకు వచ్చి సాధించుకుంటామని కేసీఆర్ చెబుతున్నారు.

 చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో చేరమని స్వయంగా కేసీఆర్ ఎంఐఎంను ఆహ్వానించారు. అయితే కేసీఆర్ ప్రతిపాదనకు ఎంఐఎం ఒప్పుకోలేదు. ఇక బిజెపి ప్రభుత్వం పట్ల కేసీఆర్ సానుకూలంగా ఉండడంతో ఎన్‌డిఏలో టిఆర్‌ఎస్ పార్టీ చేరుతుందని గత రెండేళ్ల నుంచి ప్రచారం కొనసాగుతూనే ఉంది.

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, కేంద్రంతో ఘర్షణ వైఖరి అనవసరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్‌ఎస్‌ఎల్‌పి, టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇక తెలంగాణ బీజేపీ నాయకులుమాత్రం 2019లో మేం అధికారంలోకి వస్తాం, మోడీ బహిరంగ సభ నుంచి తెలంగాణ ప్రభుత్వంపై మా పోరాటం ఉధృతంగా సాగుతుందని చెబుతున్నారు.

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

చంద్రబాబు బెదిరింపు: ఫ్రెండ్ షిప్ డే రోజున కేసీఆర్‌‌తో మోడీ

ఉమ్మడి హైకోర్టు విభజనతో పాటు విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పలు హామీల అమలు గురించి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో చెబుతారని ప్రభుత్వం ఆశిస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణ ఆశిస్తున్న వివిధ అంశాలపై ప్రభుత్వం ఒక నివేదిక రూపొందించిందని తెలుస్తోంది.

English summary
Prime Minister Narendra Modi is scheduled to make his maiden visit to Telangana on August 7 during which he will lay foundation stones of different projects collectively worth around Rs 17,000 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X