ఫేస్‌బుక్ ద్వారా బెదిరించి రేప్ చేసి, మిత్రుడికి అప్పగించాడు
హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం సహ విద్యార్థినిని బెదిరించి అత్యాచారానికి పాల్పడి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి అత్యాచార చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెడతానంటూ ప్రస్తుతం బెదిరిస్తున్నాడు. ఆ కేసులో నిందితుడిని హైదరాబాదులోని బహదూర్‌పుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి గర్భస్రావం చేయించిన మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. వివరాలను సోమవారం పురానీహవేలీలోని పోలీస్ కమిషనరేట్‌లో దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, ఏసీపీలు అశోక్‌చక్రవర్తి, శ్రీనివాసులు వెల్లడించారు.

మల్లేపల్లికి చెందిన విద్యార్థిని 2012లో అబిడ్స్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివేది. కిషన్‌బాగ్‌కు చెందిన సహ విద్యార్థి జిషాన్‌అహ్మద్(23) విద్యార్థినితోపాటు ఆమె సోదరితోనూ స్నేహం పెంచుకున్నాడు. మీ సోదరి అశ్లీల చిత్రాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఫేస్‌బుక్‌లో పెట్టి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళతానని విద్యార్థినిని బెదిరించాడు.
తాను చెప్పినట్లు నడుచుకోవాలంటూ విద్యార్థినిని జిషాన్‌అహ్మద్ తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని కిషన్‌బాగ్‌కే చెందిన ఆదిల్‌అహ్మద్‌కీ తెలియజేశాడు. అతను కూడా బాధితురాలిపై మూడునెలల పాటు పలుమార్లు అత్యాచారం జరిపాడు. ఆమె గర్భం దాల్చడంతో తీగెలకుంటలోని జీనాత్ ఆసుపత్రికి తీసుకెళ్లి గర్భస్రావం చేయించాడు.

విద్యార్థిని డిగ్రీ చదువు ఆపివేసి మరో కళాశాలలలో బీటెక్‌లో చేరింది. ఇటీవల జిషాన్‌అహ్మద్ ఫేస్‌బుక్‌లో కలిసి పాత విషయాలు గుర్తుచేయడమేగాక ఆదిల్‌అహ్మద్‌తో సాన్నిహిత్యం విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని బెదిరించాడు. రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆమె రూ.30వేలు ఇచ్చింది.
మిగతా డబ్బులకోసం ఒత్తిడి తేవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆమె ఆందోళనను గమనించిన కుటుంబీకులు విషయం తెలుసుకుని ఈనెల 17న అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి బహదూర్‌పుర పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. జిషాన్‌అహ్మద్‌నుఅదుపులోకి తీసుకుని నిర్భయ కేసు నమోదు చేశారు. మరో నిందితుడు ఆదిల్‌అహ్మద్ అమెరికా వెళ్లాడని అనుమానిస్తున్నారు. బాధితురాలికి గర్భస్రావం చేసిన వైద్యురాలు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications