ఫ్రెండ్లీ పోలీసు అంటే ఇదేనా.. వెహికిల్ ఆపకుంటే బడితపూజ, డ్రైవర్‌పై ఖాకీల ప్రతాపం..
పైకి చెప్పేది ఫ్రెండ్లీ పోలీసు.. కానీ అమలు చేసేదీ మాత్రం వేరు. ఇక డ్రైవర్లు, మమూలు వ్యక్తులు అయితే సంగతే వేరు. వారిపై రక్షక భటులు ప్రతాపం చూపిస్తారు. చిన్న కారణం దొరికినా చాలు వీపు విమానం మోత మోగాల్సిందే. మంగళవారం అచ్చం ఇలాంటి ఘటన జరిగింది. ఓ డ్రైవర్ పోలీసులు తమ అధికార దర్పం ప్రదర్శించారు. చిన్న కారణానికే చితకబాదారు. ఆ ఫుటేజీ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని నెటిజన్లు అడుగుతున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.

ఆపకుండ వెళితే అంతేనా..?
వాహనం ఆపమనగానే ఆపకుండ వెళ్లడమే పాపమైపోయింది. కాస్త దూరం వెళ్లి ఆపిన ఫలితం లేకుండా పోయింది. ఆ డ్రైవర్‌పై పోలీసులు నీచంగా ప్రవర్తించారు. బూటు కాలుతో తన్నుతూ.. లాఠీలతో చితకబాదారు. మొత్తుకుంటున్నా వినకుండా ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈ ఘటన జరిగింది. ఆ డ్రైవర్‌పై ప్రతీ ఒక్కరు జాలి చూపిస్తున్నారు. సామాన్యులపైనేనా మీ జులుం అని అడుగుతున్నారు. వారు తిరిగి అడగలేరు కదా అని రెచ్చిపోతారా అని కొశ్చన్ చేస్తున్నారు.

కిరాయికి వెళ్లి వస్తుండగా..
సదాశివపేటకు చెందిన వాజిద్ బొలెరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళుతున్నాడు. అయితే అయ్యప్పస్వామి గుడివద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన రహదారిపై ఆకస్మికంగా పోలీసులు రావడంతో వాహనాన్ని కొంచెం దూరం తీసుకెళ్లి ఆపాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాఠీలతో చితకబాదారు. అక్కడితో ఆగకుండా బూటు కాలితో తంతూ బండా బూతులు తిట్టారు. లాఠీ దెబ్బలకు వాజిద్ తీవ్రంగా గాయపడ్డాడు.

చెప్పేవి శ్రీరంగ నీతులు
పైకి ఫ్రెండ్రీ పోలీసు అని ఉన్నతాధికారులు చెబుతుంటే.. కింది స్థాయిలో అమలు కాకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరీ సామాన్య జనాన్ని ఇంత చులకన చూడటం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. వారు తిరిగి ప్రశ్నించలేనందున.. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తారా అని నిలదీస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసీంగ్ ఇలానే ఉంటుందా అని అడుగుతున్నారు.












Click it and Unblock the Notifications