మావోయిస్టుల తలలకు లక్షల వెల.. పోలీసుల పోస్టర్లతో డేంజర్ జోన్ లో మావోయిస్టులు!!
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులకు చెక్ పెట్టడానికి పోలీసులు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారా? మావోయిస్టులను పట్టిస్తే 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు నగదు బహుమతి ఇస్తామని పోలీసులు చేస్తున్న ప్రకటనలతో మావోయిస్టుల కొత్త కష్టాలలో పడుతున్నారా? తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు ఊరికే లేకుండా చేయడం కోసం పోలీసులు ఎంచుకున్న ఈ కొత్త విధానం వారికి సత్ఫలితాలను ఇస్తుందా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

మావోయిస్టులకు పోలీసులకు మధ్య ప్రచ్చన్న యుద్ధం
మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరుగుతున్న ప్రచారం యుద్ధ ఇప్పటిది కాదు. దశాబ్దాల తరబడి మావోయిస్టులకు పోలీసులకు మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. నిత్యం అడవులను జల్లెడ పడుతూ, నక్సలైట్లను హతమారుస్తున్న పోలీసులకు, అదే స్థాయిలో మళ్లీ నక్సల్ గ్రూపులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఈక్రమంలోనే మావోయిస్టులకు, వివిధ నక్సలైట్ గ్రూపులకు పర్మినెంట్ గా చెక్ పెట్టాలని భావిస్తున్న పోలీసులు వారికి ఎవరు సహకరించకుండా కొత్త ప్లాన్ వేశారు. ప్రాంతాలవారీగా సంచరించే మావోయిస్టు గ్రూపుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ, వారి ఫోటోలను పోస్టర్లు గా వేస్తూ, సమాచారం అందించిన వారికి ఐదు లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల నగదు బహుమతులను ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు.

ములుగు జిల్లాలో మావోల తలలకు వెలలు ప్రకటించిన పోలీసులు
ఇటీవల ములుగు జిల్లాలో మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వాళ్లకు నగదు బహుమతులు ఇస్తామని ప్రకటన చేసి పోలీసులు వారి పేర్లను, ఫోటోలతో సహా ప్రకటించారు. ఇక జిల్లా వ్యాప్తంగా భారీగా పోస్టర్లు వేసి 5 లక్షల నుంచి 20 లక్షల నగదు బహుమతులు అంటూ ప్రచారం చేపట్టారు. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలలో బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్న, ముచకి ఉంగల్ అలియాస్ రఘు అలియాస్ సుధాకర్, కంకణాల రాజి రెడ్డి అలియాస్ వెంకటేష్ అలియాస్ ధర్మన్న, కొవ్వాసి గంగా అలియాస్ మహేష్ అలియాస్ జనార్ధన్,కుంజా వీరయ్య అలియాస్ లచ్చయ్య అలియాస్ లక్ష్మణ్, కొవ్వాసి రాము, కుర్సం మంగు అలియాస్భద్ర అలియాస్ పాపన్న,మడకం సన్నల్ అలియాస్ మంగతూ ఉన్నారు.

వాంటెడ్ మావోయిస్ట్‌ల కోసం భూపాలపల్లి జిల్లాలోనూ నగదు బహుమతుల ప్రకటన
ఇదిలా ఉంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ పోలీసులు ఇదే పద్ధతిలో మావోయిస్టుల కోసం పోస్టర్లు వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్, కాటారం మరియు ఇతర మండలాల్లోని సుదూర ప్రాంతాలలో "వాంటెడ్ మావోయిస్ట్‌ల" డజన్ల కొద్దీ పోస్టర్లు వేయడం కలకలం గా మారింది. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి అడవుల్లోకి ప్రవేశించినట్లు భావిస్తున్న కొందరు మావోయిస్టు యాక్షన్ టీమ్‌ల సభ్యులను గుర్తించేందుకు పోలీసులు అంతర్గత మండలాల్లో 15 మంది "వాంటెడ్ మావోయిస్టుల" చిత్రాలతో కూడిన పోస్టర్‌లను ఏర్పాటు చేశారు. పోస్టర్ల ద్వారా, పోస్టర్లలో చిత్రీకరించిన మావోయిస్టుల గురించి సమాచారం అందించిన వారికి పోలీసులు 5 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు "ప్రైజ్ మనీ" ప్రకటించారు.

తాజాగా మహబూబాబాద్ జిల్లాలోనూ మావోల కోసం పోస్టర్లు
ఇక తాజాగా మహబూబాబాద్ జిల్లాలోనూ పోలీసులు ఇదే తరహాలో మావోయిస్టులకు వెలలను ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో సంచరిస్తున్న మావోయిస్టుల ఫోటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దని, వారి గురించి సమాచారం తెలిపినవారికి ఐదు లక్షల నుంచి 20 లక్షలకు నగదు నగదు బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా మావోయిస్టులకు ఆశ్రయం కల్పించినా, వారికి సహకరించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ పోస్టర్లపై అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐల ఫోన్ నెంబర్లను ముద్రించారు.

పోలీసుల వ్యూహంతో చిక్కుల్లో మావోలు ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసుల వ్యూహంతో మావోయిస్టు పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎవరు ఎలా తమకు ఇబ్బందులు తీసుకువస్తారు అనేది అర్థం కాక ఎక్కడికి వెళ్లాలన్నా భయపడుతున్న పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కొందరు పోలీసుల అదుపులో ఉండగా, తాజా పరిణామాలతో మరింత మంది పట్టుబడే అవకాశం ఉందన్న చర్చ స్థానికంగా జరుగుతుంది. ఏదేమైనా మావోలను కట్టడి చేయడానికి పోలీసులు వేసిన మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications