నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున సోదరి, హీరో సుశాంత్ తల్లి, సినీ నిర్మాత నాగ సుశీలపై పోలీసు కేసు నమోదైనట్లు సమాచారం. నాగ సుశీల తోపాటు మరో 12 మందితో కలిసి తనపై దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
నాగ సుశీల, శ్రీనివాస్‌ల గత కొంత కాలంగా భూ వివాదం కొనసాగుతుందని, వీరు గతంలో కూడా వ్యాపార భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. నాగసుశీల, శ్రీనివాస్ గత కొన్నేళ్ల నుంచి వివిధ వ్యాపారాల్లో పార్టనర్స్‌గా ఉండటంతోపాటు ఓ సినిమా బ్యానర్‌ను కూడా స్థాపించారు. శ్రీనాగ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి వీరు పలు సినిమాలు నిర్మించారు.

సుశాంత్ హీరోగా మూడు సినిమాలు చేయగా.. ఆ సినిమాల్లో 'కరెంట్' సినిమా హిట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన అడ్డా, ఆటాడుకుందాం రా.. చిత్రాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసిన క్రమంలో మనస్పర్థలు ఏర్పడటంతో దూరం పెరిగింది. ప్రస్తుతం చింతలపూడి శ్రీనివాస్ శ్రీజ ప్రకృతి దర్శపీటం నిర్వాహకుడిగా ఉన్నారు.
అయితే, సెప్టెంబర్ 12న నాగసుశీల, ఆమె అనుచరులు దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. కాగా, 2017లో తన అనుమతి లేకుండా భూములు అమ్మారని ఆరోపిస్తూ చింతలపూడి శ్రీనివాస్‌పై నాగ సుశీల పంజాగుట్ట పోలీసులకు చేశారు. అయితే, తనను లాకప్‌లో పెట్టి తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ గతంలో ఆరోపించారు. తాజాగా, ఇప్పుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.












Click it and Unblock the Notifications