పోర్న్ సైట్లో పెడ్తానని బెదిరింపు, పేరెంట్స్ జాగ్రత్త: కమిషనర్, ధైర్యంగా ఓ అమ్మాయి తల్లి ఫిర్యాదు
హైదరాబాద్: దాదాపు రెండు వందల మంది అమ్మాయిలతో చాటింగ్ చేసి, పలువురిని బ్లాక్ మెయిల్ చేసిన నిందితుడు అబ్దుల్ మాజిద్‌ను పోలీసులు శుక్రవారం నాడు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ సివి ఆనంద్ విలేకరులతో మాట్లాడారు.
ఇది ప్రతి ఇంటి సమస్య అని భావించి వివరాలు తెలియజేయడం జరుగుతోందన్నారు. దాదాపు ప్రతి ఇంట్లో ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర ఇంటర్నెట్ వాడుతుంటారని చెప్పారు.
సీవీ ఆనంద్ మాట్లాడుతూ... అబ్దుల్ మాజిద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వయస్సు 21. ఆరు ఫేస్‌బుక్ ప్రొఫైల్ అకౌంట్లు క్రియేట్ చేసి అందులో అమ్మాయిల ఫోటోలు పెట్టి.. ఆరుగురిని పరిచయం చేసుకున్నాడు. మొత్తంగా అతను దాదాపు 200 మంది అమ్మాయిలతో చాటింగ్ చేశాడు.
తొలుత ఫ్రెండ్ షిప్ అనే పేరుతో లోబర్చుకున్నాడు. ఆ తర్వాత చాటింగ్ ద్వారా వారిని మభ్యపెట్టి వ్యక్తిగత విషయాలు ఆరా తీసేవాడు. వ్యక్తిగత విషయాలు ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేసి ఫేస్‌బుక్ పేజీ పైన పెడతానని బెదిరించేవాడు.
అంతేకాదు, పోర్న్ సైట్లలో కూడా పెడతానని బెదిరించేవాడు. దాదాపు 18 నెలలుగా అతను ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడు. అయితే, ఇప్పటి వరకు ఏ అమ్మాయి కూడా తల్లిదండ్రులకు ఇతని వేధింపులు చెప్పలేదు. అమ్మాయిలే మానసిక క్షోభ అనుభవించారు.
అయితే, ఓ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. ఇప్పటికే ఓ అమ్మాయి వద్ద డబ్బులు వసూలు చేసినట్లుగా అనుమానం ఉంది. దానిని దర్యాఫ్తు చేయవలసి ఉంది. తాను ఏం చెప్పినా బాధిత అమ్మాయిలు చేసే పరిస్థితిని నిందితుడు తీసుకు వచ్చాడు.

అమ్మాయిలు భయపడి
తమ ఫోటోలు ఇంటర్నెట్లో పెడతారని భయపడి వారు అతను చెప్పినట్లు చేసేందుకు అంగీకరించేవారు. ఇప్పటి వరకు ఆరుగురు అమ్మాయిల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసినట్లు కమిషనర్ చెప్పారు.
ఎడ్యుకేషన్ పేరుతో చిన్న పిల్లలకు ఐ పాడ్ వంటివి ఇస్తున్నారని, అలా ఇవ్వవచ్చునని కానీ, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెద్ద పెద్ద పాఠశాలలను ఈ నిందితుడు టార్గెట్ చేశాడని చెప్పారు.
ఎంతమంది స్నేహితులు ఉంటే అంత పాపులర్ అన్న అభిప్రాయం అమ్మాయిల్లో ఉందని, దానిని నిందితుడు అడ్వాండేజ్‌గా తీసుకున్నాడని చెప్పారు. నిందితుడు పది ఫేస్‌బుక్ అకౌంట్లు క్రియేట్ చేశాడని, వాటిని మేం ఇస్తున్నామని, వాటిని ఆయా అమ్మాయిల తల్లిదండ్రులు డిలీట్ చేయాలని సూచించారు.
విద్యాసంస్థలు జాగ్రత్తలు పాటించాలి
పాఠశాలలు, కాలేజీల్లో సైబర్ సెక్యూరిటీకి సిబ్బందిని పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేవలం ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం, ఐపాడ్‌లు ఇవ్వడంతో పాటు భద్రతా సిబ్బందిని కూడా పెట్టుకోవాలన్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.
జాగ్రత్తలు అనివార్యమని, దీనిని తాము ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టు తీసుకొస్తామన్నారు. విద్యాసంస్థలు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇది ప్రతి కుటుంబంలో జరుగుతున్న ఇబ్బంది కాబట్టి మేం ముందుకు వచ్చి చెబుతామని ఓ విద్యార్థి వచ్చిందన్నారు. ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన తల్లి, కూతుళ్లను కమిషనర్ ప్రశంసించారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రతి విషయాన్ని పంచుకునేలా ఉండాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఆ ధైర్యం ఇచ్చేలా ఉండాలన్నారు.
పిల్లలకు అండగా ఉండాలి: ఫిర్యాదు చేసిన బాధిత అమ్మాయి తల్లి
పిల్లలకు అండగా ఉండాలని ఫిర్యాదు చేసిన బాధిత అమ్మాయి తల్లి అన్నారు. మనం పిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలని సూచించారు. ఏదైనా చెప్పేందుకు పిల్లలకు తల్లిదండ్రులు అవకాశం ఇవ్వాలన్నారు. ఏదైనా తప్పు జరిగితే మేం ఉన్నామనే ధైర్యం వారికి ఇవ్వాలన్నారు. తన కూతురుకు సందేశాలు వచ్చినప్పుడు వెంటనే తన వద్దకు వచ్చి చెప్పిందని అమ్మాయి తల్లి చెప్పారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications