హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందీ నేర్పిస్తా..పద: థాయ్‌ స్టూడెంట్‌పై హైదరాబాద్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది విద్యార్థులు ఒక్కసారిగా క్యాంపస్ ఆవరణలో ఆందోళనకు దిగారు. బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. నినాదాలతో క్యాంపస్‌ను హోరెత్తించారు. యూనివర్శిటీ అడ్మిన్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు ఆందోళనకు దిగిన సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్‌కు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సెంట్రల్ యూనివర్శిటీలో చదువుకుంటోన్న థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడటమే దీనికి కారణం. ఆ ప్రొఫెసర్ పేరు రవి రంజన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో హిందీ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నాడు. హిందీ గ్రామర్ నేర్పిస్తానంటూ థాయ్‌లాండ్ విద్యార్థినికి మాయ మాటలు చెప్పి.. తన కారులో ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. మద్యాన్ని తాగించాడు.

Police have taken Hyderabad Central University professor into custody after alleged molested a student

ఈ సందర్భంగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రొఫెసర్ లైంగిక దాడిని తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను కొట్టాడు. విద్యార్థినిని కారులో తీసుకొచ్చి యూనివర్సిటీ గేటు దగ్గర వదిలి పెట్టాడు. అక్కడి నుంచి బాధితురాలు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రొఫెసర్ రవి రంజన్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మాదాపూర్ డీసీపీ కే శిల్పవల్లి ధృవీకరించారు. ప్రొఫెసర్‌ను కస్టడీలోకి తీసుకున్నామని వివరించారు.

ఈ సమాచారం తెలిసిన వెంటనే వందలాది మంది సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులను ప్రదర్శించారు. హెచ్‌సీయూ రోడ్డు మీద బైఠాయించారు. ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. తమ తరగతులను బాయ్‌కాట్ చేశారు. ఈ ఘటనతో సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, విద్యార్థులను నచ్చజెప్పారు.

English summary
Cyberabad Police have taken a professor of University of Hyderabad into custody after a student alleged that he molested her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X