భలే మిత్రులు: చోరీల్లో చేయి చేయి కలిపి..... (ఫొటో)
హైదరాబాద్: ఇద్దరు మిత్రులు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఇద్దరు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న ఆ ఇద్దరినీ హైదరాబాదులోని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ మండలం కొండపేట కాలనీ నివాసి అరికిచర్ల రామ్మోహన్(30) భార్యతో కలిసి 2011లో నగరానికి అపురూపకాలనీలో ఉంటున్నాడు.

కృష్ణా జిల్లా గూడూరు మండలం జక్కంచర్లకు చెందిన వెంకటసుబ్బారావు 2009లో కుటుంబసమేతంగానగరానికి వచ్చి వివేకానందనగర్‌లో కాపురం పెట్టాడు. ఇరువురు బాలానగర్‌లోని ఓ రంగుల పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. రామ్మోహన్ గతంలో ఐదు బైకులను చోరీ చేసి జైలుకెళ్లి వచ్చాడు.
తన తోటీ కార్మికుడు వెంకటసుబ్బారావుతో కలిసి జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించేందుకు బైకులు దొంగిలించడం మొదలు పెట్టారు. జీడిమెట్ల, మాదాపూర్, రాయదుర్గం ఠాణాల పరిధుల్లో మొత్తం 19 వాహనాలు దొంగిలించారు.
వాహనాల కాగితాలు పోయాయయని చెబుతూ రూ.5 నుంచి 10 వేలకు వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమవారం ఉదయం షాపూర్‌నగర్‌లోని తిరుమల బేకరీ ముందు నిలిపిన హీరోహోండాను దొంగిలించిన వీరు ఆ వాహనంపై వెళుతూ అదే సమయంలో కుత్బుల్లాపూర్ కూడలిలో తనిఖీ చేస్తున్న జీడిమెట్ల పోలీసులకు పట్టుబడ్డారు.












Click it and Unblock the Notifications