పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వీని రెడ్డి అత్తా మామలకు నోటీసులు

వరంగల్: పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీ రెడ్డి అత్తామామలు అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 28వ తేదీ మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

 police serve notices to jhansi reddy couple in thorrur due to election code

ఎన్నికల కోడ్ ఉన్నందున.. అమెరికా పౌరసత్వం కలిగిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు ఇక్కడ ఉండకూడదని, తిరిగి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, వారు నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారు. చర్లపాలెం గ్రామం మా సొంత ఊరు అని.. ఆ ఊరిని మేము దత్త తీసుకున్నామని చెప్పారు. అంతేగాక, ఇక్కడ ఉండేందుకు తమకు హక్కు ఉందని ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు పోలీసులకు తెలిపారు.

ఈ క్రమంలో అక్కడ్నుంచి వెళ్లిపోయిన పోలీసులు.. తొర్రూరు డీఎస్పీ వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో కలిసి క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. పోలీసులు భారీగా చేరుకున్నారు.

తాము ఏం పాపం చేశామని.. తమ కోడలు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే తాము ఇక్కడ ఉండకూడదా? అని ఝాన్సీరెడ్డి కంటతడి పెట్టారు. ఆడవాళ్లు అని చూడకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రకంగా తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. కాగా, ఎన్నికల ప్రచారం ముగియడంతో స్థానికేతరులు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఉండకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+