వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు ఓటరు ఎటు వైపు? అన్ని రాజకీయ పార్టీల్లోనూ అంతర్మధనం

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. నేటితో మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి తెరపడనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటరు నాడి అర్థం కాక అంతర్మధనం లో పడ్డాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు అన్ని పార్టీలు నిర్వహించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు ఇలా ప్రతిదానిలోనూ పాలుపంచుకున్నారు. మునుగోడు ఓటర్లు తమ వద్దకు ఓటు కోసం వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర తమ తమ ప్రాంతాలకు ఏంకావాలో చెప్పి వాటికి సంబంధించిన హామీలు తీసుకున్నారు. ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు మునుగోడు ఓటర్ నాడి కనిపించలేదు. దీంతో అన్ని రాజకీయ పార్టీలలో ఓటర్లు ఏ పార్టీ కొంప ముంచుతారు అన్నది అర్థం కావడం లేదు.

మునుగోడు ఓటర్ల మనసు గెలుచుకోవటానికి టీఆర్ఎస్ నానా పాట్లు.. ఓటర్లు ఆదరిస్తారా?

మునుగోడు ఓటర్ల మనసు గెలుచుకోవటానికి టీఆర్ఎస్ నానా పాట్లు.. ఓటర్లు ఆదరిస్తారా?

మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కు ఎంతో ప్రతిష్టాత్మకం. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తేనే, కెసిఆర్ జాతీయ పార్టీకి దేశం లో పరువు ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తేనే భవిష్యత్తులో జరిగే ఎన్నికలపై టిఆర్ఎస్ కు పట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుని ప్రచారం నిర్వహించింది. ఊరికి ఒక ఎమ్మెల్యే ని రంగంలోకి దించి ఎన్నికల ప్రచారం చేసింది. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుండి రాష్ట్రంలోని మంత్రులందరూ మునుగోడు లో మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ సైతం బహిరంగ సభ నిర్వహించి మునుగోడు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇన్ని చేసినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారా? అన్నది మాత్రం ప్రశ్నార్థకమే.

మునుగోడులో ఓటర్లు బీజేపీకి పట్టం కడతారా?

మునుగోడులో ఓటర్లు బీజేపీకి పట్టం కడతారా?

ఇక మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పార్టీ బిజెపి. బిజెపి కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తేనే, భవిష్యత్తు ఎన్నికల్లో పట్టు ఉంటుందని భావించి విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు స్థానం తన సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి మునుగోడు పై పట్టు సాధించడం కోసం శతవిధాల ప్రయత్నం చేశారు. బిజెపి ముఖ్య నేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి గుర్తు కమలం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం కోసం, గుర్తు ని ఎక్కువగా ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనేకచోట్ల రాజగోపాల్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుండి ప్రతిఘటనలు ఎదురయ్యాయి. తన వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని, అందుకే మునుగోడులో అభివృద్ధి జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేశారు. అయితే మునుగోడు ఓటర్లు రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ ఆదరిస్తారా లేదా అన్నది మాత్రం బిజెపి శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ అంతర్గత కలహాల ప్రభావం

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ అంతర్గత కలహాల ప్రభావం

మునుగోడు ఉప ఎన్నికల్లో తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించిన మరొక పార్టీ కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వెనుకబడింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు మునుగోడు ఉప ఎన్నిక పై తీవ్ర ప్రభావం చూపించాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని, రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని ఆయన మాట్లాడిన ఆడియో లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునుగోడులో సమన్వయంతో పని చేయకపోవడం వంటి అనేక కారణాలు వెరసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వెనకబడింది.

మునుగోడు ఓటర్లు హస్తానికి ఓటేస్తారా? కాంగ్రెస్ లో ఆందోళన

మునుగోడు ఓటర్లు హస్తానికి ఓటేస్తారా? కాంగ్రెస్ లో ఆందోళన


అయితే మునుగోడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసినప్పటికీ మునుగోడు లో కాంగ్రెస్ ను ఓటర్లు ఆదరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. మునుగోడు లో గెలిస్తే భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు దొరుకుతుందని భావిస్తున్నా కాంగ్రెస్ పార్టీ మునుగోడు లో టిఆర్ఎస్ , బిజెపిలకు పోటీగా ప్రచారంలో దూసుకు పోలేకపోయింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఓటర్లు ఆదరిస్తారా లేదా అన్న అనుమానాలకు కారణంగా మారాయి. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటరు నాడి అర్థం కాక తెగ ఆందోళన పడుతున్నాయి.

English summary
The Munugode election campaign will end today. Due to this, it was not clear which side the voter's heart was on, and infighting started in all the parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X