Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక బదిలీ వెనుక రాజకీయ ఒత్తిడి.. కారణం ఇదేనా!!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వరంగల్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక బదిలీ జరిగింది. దీని వెనుక రాజకీయ ఒత్తిడి ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

వరంగల్: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఐఏఎస్ ల ఆకస్మిక బదిలీ వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన ప్రావీణ్యను వరంగల్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే, గంటల వ్యవధిలోనే ఆమె నిన్న సాయంత్రం వరంగల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈరోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కలెక్టర్ గా పని మొదలుపెట్టారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక బదిలీ

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక బదిలీ


నిన్నటి వరకు జిల్లా కలెక్టర్ గా ఉన్న బి గోపిని తదుపరి పోస్టింగు కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆయనను ఏ జిల్లాకు కేటాయించకుండా వెయిటింగ్ లో పెట్టడంపై సర్వత్ర చర్చ జరుగుతుంది. కలెక్టర్ గా బి గోపి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఆయనను ఆకస్మికంగా బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ బి గోపి బదిలీ వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది.

ప్రజా ప్రతినిధుల ఒత్తిడితోనే కలెక్టర్ బదిలీ .. స్థానికంగా చర్చ

ప్రజా ప్రతినిధుల ఒత్తిడితోనే కలెక్టర్ బదిలీ .. స్థానికంగా చర్చ

ఇటీవల ఐఏఎస్ ల బదిలీల సమయంలో వరంగల్ జిల్లా కలెక్టర్ బదిలీని చేపట్టని తెలంగాణ ప్రభుత్వం ఉన్న పళంగా అకస్మాత్తుగా ఆయనను బదిలీ చేసింది. జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు కలెక్టర్ ను బదిలీ చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది. వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన గోపి పని విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడంతో ఆయన స్థానిక రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కంటగింపుగా మారారు. రూల్ ప్రకారమే కచ్చితంగా పని చేసే గోపీ తీరుతో స్థానిక ప్రజా ప్రతినిధులు అసహనంతో ఉన్నారు.

ఎన్నికల ఏడాది అనుకూలంగా పని చేసే అధికారులు కావాలనే బదిలీ?

ఎన్నికల ఏడాది అనుకూలంగా పని చేసే అధికారులు కావాలనే బదిలీ?

దీంతో హైదరాబాదులో ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో అధిష్టానం ముందు జిల్లా ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా పనిచేసే అధికారులు కావాలని, రానున్న ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఎన్నికల ఏడాది అనుకూలంగా పని చేసే అధికారులు కావాలనే బదిలీ చేయించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కలెక్టర్ బి గోపిని పోస్టింగ్ ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో రిపోర్టింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అకస్మాత్తుగా విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. పేలవమైన పనితీరుతో వరంగల్ కమీషనర్ గా ఉన్న ప్రావీణ్యను జిల్లా కలెక్టర్ గా వరంగల్ జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక వరంగల్ కమీషనర్ గానే తన మార్క్ పనితీరు చూపించలేకపోయిన ప్రావీణ్య జిల్లాలో తన మార్క్ పనితీరు ఎలా చూపిస్తారు అన్న చర్చ జరుగుతుంది.

తాజా బదిలీలపై సర్వత్రా ఆసక్తి

తాజా బదిలీలపై సర్వత్రా ఆసక్తి


ఇక గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా ఉన్న ప్రావీణ్యను జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడంతో మరి గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా ఎవరికి అవకాశం వస్తుంది అన్న చర్చ కూడా స్థానికంగా జరుగుతుంది. గ్రేటర్ వరంగల్ కమీషనర్ గా తమకు అనుకూలంగా ఉండే వారి కోసం స్థానిక నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తాజా బదిలీలపై అటు ప్రజలలోనూ, రాజకీయ వర్గాలలోను ఆసక్తి కనిపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+