Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jubilee Hills Voting: ఓటర్ల భారీ షాక్, అంచనాలు తారు మారు..!?

రాజకీయంగా జూబ్లీహిల్స్ పోలింగ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో పోలింగ్ శాతం మాత్రం తక్కువగా కనిపిస్తోంది. తొలి నాలుగు గంటల పోలింగ్ ముగిసే సమయానికి 20.76 శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ వేళ నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటం పైన ఎన్నికల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయ నేతల పరస్పర ఫిర్యాదులు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే, అందరి అంచనాలు తారు మారు చేస్తూ ఓటర్ల మాత్రం ఇప్పటి వరకు భారీ షాక్ ఇచ్చారు.

జూబ్లీహిల్స్ లో పోలింగ్ చూస్తుంటే అందరి అంచనాలు తారు మారు అవ్వటం ఖాయంగా కనిపి స్తోంది. ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 4 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉండటంతో అధికా రులు కీలక అంక్షలు విధించారు. ఓటింగ్ సాయంత్రం 6 వరకు జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

Polling percentage 20 76 recorded in first four hours in jubilee hills details here

ఎలాంటి అవాంఛనీయ ఘటన లు చోటుచేసుకోకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతతో పాటు 139 డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచి పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇక్కడ భారీ పోలింగ్ నమోదు చేసేందుకు ఎన్నికల సంఘంతో పాటుగా పోటీలో ఉన్న పార్టీలు ప్రయత్నాలు చేసాయి. పోలింగ్ శాతానికి అనుగుణంగా ఫలితాల పైన అభ్యర్ధులు లెక్కలు వేస్తున్నారు.

కాగా, నియోజకవర్గ ఓటర్లు మాత్రం షాక్ ఇచ్చారు. పోలింగ్ ప్రారంభమై అయిదు గంటలు అయినా ఇంకా పలు కేంద్రాలు ఖాళీగానే కనిపిస్తున్నాయి. బస్తీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ లో ఆ ఏరియాల్లోనూ ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు పోలింగ్ జరగలేదు. పార్టీలు తమ గెలుపును పోలింగ్ శాతం ఆధారంగానే అంచనాలు వేస్తున్నాయి. అయితే, దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో మాత్రమే అతి తక్కువ పోలింగ్ కనిపిస్తోంది. పోలింగ్‌పై జూబ్లీహిల్స్ ఓటర్ల నిరాసక్తత కనిపిస్తోంది. జనం లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాలతో అభ్యర్ధుల్లో టెన్షన్ కనిపిస్తోంది.

Polling percentage 20 76 recorded in first four hours in jubilee hills details here

ఓటేసేందుకు ఆసక్తి చూపని జూబ్లీహిల్స్ ఓటరు నాడి అంతు చిక్కటం లేదు. ఈసీ ఎంత అవగాహన పెంచినా పోలింగ్ శాతం నామ మాత్రంగానే ఉంది. బస్తీల్లో మాత్రమే ఎంతో కొంత ఓటింగ్ శాతం కనిపిస్తోంది. మిగతా ప్రాంతాల్లో కదలని ఓటర్లు బయటకు రావటం లేదు. వెంగళ రావు నగర్, మధురా నగర్ లో ఓటర్లు నెమ్మదిగా కదులుతున్నారు. సాయంత్రానికి నమోదయ్యే పోలింగ్ శాతం.. ఎవరికి గెలుపు దక్కుతుందనేది స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+