వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ ఫాంహౌస్ ముందు నిలబడి నీతప్పు చూపించకూడదా? కేసీఆర్, నీ శేషజీవితం చర్లపల్లి జైల్లోనే: పొన్నాల లక్ష్మయ్య

|
Google Oneindia TeluguNews

ప్రతిపక్ష పార్టీలపై అణచివేతకు పాల్పడుతున్న కెసిఆర్ ప్రభుత్వ తీరుపై, సీఎం కేసీఆర్ ద్వంద విధానాలపై మాజీ టీపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే సమయంలో బిజెపిపైన కూడా ఆయన విరుచుకుపడ్డారు. రైతుల విషయంలో రెండు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు పొన్నాల లక్ష్మయ్య.

ఏపీ-తెలంగాణా మధ్య కొత్త రగడ: బోర్డర్ లో ఏపీ ధాన్యం లారీలకు బ్రేక్ ; ఏపీ రైతులకు షాక్!!ఏపీ-తెలంగాణా మధ్య కొత్త రగడ: బోర్డర్ లో ఏపీ ధాన్యం లారీలకు బ్రేక్ ; ఏపీ రైతులకు షాక్!!

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న రైతులు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న రైతులు

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని, రెండు ప్రభుత్వాల చర్యలు మనం చూస్తున్నామని మాజీ మంత్రి, మాజీ టీపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పునాదుల మీద ఈ దేశం ముందుకెళ్లాలని అందరూ కోరుకుంటే వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రైతులు నలిగిపోతున్నారు అని మండిపడ్డారు.

ప్రజల గొంతు నొక్కేస్తున్నారు.. ఇది మంచిదా?

ప్రజల గొంతు నొక్కేస్తున్నారు.. ఇది మంచిదా?

ఇప్పటివరకు రాష్ట్రంలో రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేయలేదని యాసంగి విషయం ఏమి చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నాల లక్ష్మయ్య. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న కేసీఆర్ బీజేపీలను ఎండగట్టేందుకు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని టిఆర్ఎస్ సర్కార్ అడ్డుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఏ ప్రజల చేత ఎన్నుకోబడ్డారో ఆ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇది మంచిదా అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ లో దొడ్డు రకం వడ్లు వేసింది నిజం కాదా?

కేసీఆర్ ఫామ్ హౌస్ లో దొడ్డు రకం వడ్లు వేసింది నిజం కాదా?

ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేసి రైతులకు నష్టం కలిగించింది కేసీఆర్ కాదా అంటూ నిలదీశారు. కెసిఆర్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. రైతులందరిని సన్న ఒడ్లు వేయమనికేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో దొడ్డు ఒడ్లు వేసింది నిజం కాదా ? అంటూ ప్రశ్నించారు పొన్నాల లక్ష్మయ్య. అడిగితే కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అని సీఎం కేసీఆర్ చెబుతున్నాడు. ఒక సీఎం కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడా ? అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తాను రోడ్లు పండించుకోవడానికి పర్మిషన్ తీసుకుంటారు కానీ, రైతులకు మాత్రం పర్మిషన్ ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరంకుశత్వం కొనసాగానిద్దామా?

కెసిఆర్ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఈ నిరంకుశత్వాన్ని కొనసాగనిద్దామా అంటూ ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి అని అన్న కేసీఆర్ తన ఫాంహౌస్లో 150 ఎకరాల్లో వరి పండిస్తున్నారు ఎందుకో చెప్పాలన్నారు. ప్రజలకు వరిసాగు చేయొద్దు అని చెప్పి కెసిఆర్ ఫాం హౌస్ లో వరి పంట పండించడం పై నిరసన తెలపడం మా హక్కు కాదా...? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

మీ ఫామ్ హౌస్ ముందు నిలబడి మీ తప్పు చూపించకూడదా?

మీ ఫామ్ హౌస్ ముందు నిలబడి మీ తప్పు చూపించకూడదా?

గతంలో ప్రభుత్వాలు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాయి అని గుర్తు చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రచ్చబండ కార్యక్రమానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. మీ ఫామ్ హౌస్ ముందు నిలబడి మీ తప్పు చూపించకూడదా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన చుట్టూ రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టు కాదా కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని తేల్చి చెప్పారు. కెసిఆర్ నీ శేషజీవితం చర్లపల్లి జైలు లోనే అంటూ మాజీ మంత్రి, మాజీ తెలంగాణ పీసీసీ చీఫ్ లక్ష్మయ్య కెసిఆర్ పై విరుచుకుపడ్డారు.

English summary
KCR cultivating paddy at the farmhouse, but farmers are not to do paddy farming? Former minister Ponnala Lakshmaiah asked. Ponnala Lakshmaiah was outraged KCR, that the rest of your life was in Charlapalli jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X