Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'కేసీఆర్‍‌! కేజ్రీ గతే, రోజుకు 2లక్షలు ఖర్చు అవసరమా'

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీకి చెంపపెట్టులాంటివని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకూ ఒక హెచ్చరికేనని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మంగళవారం హెచ్చరించారు. ఢిల్లీ ఫలితాలు వెల్లడైన అనంతరం మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.

ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ విధానాలు ఎంతోకాలం సాగవనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ఎనిమిది నెలల కాలంలో కేవలం సభలు, సమావేశాలు, స్వచ్ఛ భారత్‌, జీరో అకౌంట్లు, గ్రామాల దత్తత తప్ప నిర్మాణాత్మకంగా కేంద్రం ఏ ఒక్కటీ చేపట్టలేదన్నారు. కేంద్రానికి దగ్గరగా ఉండే ఢిల్లీ ప్రజలు కేంద్ర ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకొని అమ్‌ అద్మీ పార్టీకి అండగా నిలిచారన్నారు.

 Ponnam Prabhakar questions about KCR's staying in luxury hotel

దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కావడం ఆ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. ఈ ఫలితాలతో నియంతృత్వ విధానాలు ఎంతోకాలం సాగవన్న విషయాన్ని కేసీఆర్‌ కూడా గుర్తుంచుకోవాలన్నారు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ లేకపోతే ఏపీ భవన్‌ అందుబాటులో ఉండగా రోజుకు రెండు లక్షలు వెచ్చించి అశోకా హోటల్‌లో ఉండాల్సిన అవసరం ఏముందన్నారు.

రాష్ట్రంలో పేదలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం సాయం చేయడం మరిచిపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎలా చేస్తారని ప్రశ్నించారు. సానియా మీర్జాకు రెండు కోట్లు, వాస్తు పేరిట భవనాల తరలింపు, మంత్రులకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలను సమకూరుస్తూ తుగ్లక్‌ పాలనను తలపిస్తున్నారన్నారు. అవినీతి జరగడం వల్లే తాటికొండ రాజయ్యను బర్తరఫ్‌ చేశామని చెబుతున్న సీఎం ఎంత మేరకు అవినీతి జరిగిందో ఎందుకు ప్రకటించడం లేదన్నారు.

శ్రీలంకలో రాజపక్సే ఓటమి, ఇప్పుడు మోడీ ఢిల్లీలో వైఫల్యం తర్వాత కాలంలో కేసీఆర్‌కు, ఆ తర్వాత చంద్రబాబుకు ఇదే పరిస్థితి తప్పదని పొన్నం హెచ్చరించారు. ప్రజా ఆస్తులు అ మ్మే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేయడానికి బదులు స్వంత ఏజెండాలకు మొగ్గు చూపితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+