రాహుల్ గాంధీ ఏం సలహాలిస్తారో, చూడాలి: కవిత
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్ర పేరిట తెలంగాణలో చేపట్టనున్న పాదయాత్ర పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
ఆత్మహత్యల బాట పడుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకే రాహుల్ తెలంగాణలో వస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అలా రైతులను పరామర్శించే రాహుల్ గాంధీ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేస్తారని ఆ పార్టీ ప్రకటించారని, కానీ రాహుల్ పర్యటన ఉద్దేశ్యం రైతుల ఉద్దరణ కాదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలోనే రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారని చెప్పారు. అరవై ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిందో చెప్పాలన్నారు. తాము కూడా రాహుల్ పర్యటనను పరిశీలిస్తామన్నారు. రైతుల ఆత్మహత్య నివారణకు రాహుల్ ఏం సలహాలిస్తారో చూడాలన్నారు.

జళగం వెంగళ రావు పార్కును ఆధునీకరిస్తాం: హరీష్ రావు
బంజారాహిల్స్‌లోని జళగం వెంగళ రావు పార్కును పూర్తిగా ఆధునీకరిస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం ఉదయం మంత్రులు నాయిని, హరీష్ రావు జళగం వెంగళ రావు పార్కును సందర్శించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. పార్కులోని చెరువులో పూడికతీత పనులు ప్రారంభిస్తామన్నారు. జిమ్ సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ముప్పై చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. చెరువులు కబ్జాకు గురికాకుండా ప్రత్యేక చట్టం తెస్తామన్నారు.












Click it and Unblock the Notifications