ప్రపంచానికే తలమానికంగా తెలుగు మహా సభలు
Recommended Video

హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ఎల్బీస్టేడియంలో సంబురంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, శాససభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, ఎంపీ జితేందర్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్షనాయకుడు కే కేశవరావు, ఎంపీ అసదుద్దీన్‌ఓవైసీ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ నెల డిశంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన...కవిరత్న చింతల శ్రీనివాస్ ఐ.ఏ.ఎస్., మాట్లాడుతూ జరుగుతున్న ఈ సంబురాలు ప్రపంచానికే తలమానికంగా నిలిచే విధంగా వున్నాయి అంటు తోటి కళాకారుల మధ్య వేదికని పంచుకోవటంలో ఉన్నా సంతోషాన్ని వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications