పీకే వ్యూహాలతోనే టీఆర్ఎస్ పయనం: సీఎం కేసీఆర్‌తో రెండ్రోజుల సుదీర్ఘ చర్చలు, ఎలా ముందుకు?

హైదరాబాద్: త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(పీకే) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. గత రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో సుదీర్ఘ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పీకే.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ కోసం ఎలా పనిచేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

పీకేతో కేసీఆర్ సుదీర్ఘ భేటీ, కీలక చర్చలు

పీకేతో కేసీఆర్ సుదీర్ఘ భేటీ, కీలక చర్చలు

పీకే నేతృత్వంలోని ఐప్యాక్ సేవలు కొనసాగించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ సంస్థ సేవలను అందించనుంది. ఈ విషయంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో రెండు రోజులుగా ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారు. హైదరాబాద్‌‌లోని ప్రగతిభవన్ వేదికగా వీరి చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయి. రాష్ట్రస్థాయిలో జరిపిన సర్వే వివరాలను కూడా కేసీఆర్‌కు అందించినట్లు సమాచారం.

జాతీయ స్థాయిలో కూటమి లేదా కొత్త పార్టీ: కేసీఆర్-పీకే భేటీ చర్చ

జాతీయ స్థాయిలో కూటమి లేదా కొత్త పార్టీ: కేసీఆర్-పీకే భేటీ చర్చ

సర్వేలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లను ప్రభావితం చేయడం ఇతరత్రా వాటి కోసం ఈ ఐప్యాక్ సేవలు అందించనుంది. రెండో రోజు ఆదివారం కూడా సాగిన సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, ప్రశాంత్ కీలకంగా చర్చలు జరిపినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేకపోతే కూటమి లేదా కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా కేసీఆర్-పీకే భేటీ: టీఆర్ఎస్.. కాంగ్రెస్‌తో ఎలా?

రెండు రోజులుగా కేసీఆర్-పీకే భేటీ: టీఆర్ఎస్.. కాంగ్రెస్‌తో ఎలా?

తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర నేతల పట్ల ప్రజాభిప్రాయంపై సర్వేలను ఈ సందర్భంగా కేసీఆర్, పీకే చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ రెండు రోజులుగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది కూడా కీలకంగా మారింది.

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పీకే ప్లాన్.. కేసీఆర్‌తో కలిసి

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పీకే ప్లాన్.. కేసీఆర్‌తో కలిసి

వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై పీకేతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు అవసరమైన అంశాలపై వారిద్దరి మధ్య కీలక చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలు, బీజేపీ పరిస్థితిపై పీకే‌తో కేసీఆర్ మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వీరి భేటీ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వ్యతిరేకంగా కూటమిలో టీఆర్ఎస్‌ను భాగస్వామిని చేసేందుకే పీకే శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన విషయాలు త్వరలోనే ఆచరణ రూపంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. కాగా, ఇలాంటి భేటీలు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+