హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిబ్బన్ కట్ చేసిన కేంద్ర మంత్రి: హైదరాబాద్‌లో ప్రాట్ & విట్నీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యునైటెడ్ టెక్నాలజీస్ కార్పోరేషన్‌కు చెందిన యూనిట్ అయిన ప్రాట్ & విట్నీ హైదరాబాద్‌లో గురువారం తన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. నూతన ఇంజిన్ మోడల్స్‌పై ఈ కేంద్రంలో ఎయిర్ క్రాప్ట్ ఇంజినీర్లు, టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తారు.

భారతదేశంలో 300కుపైగా విమానాలు ప్రాట్ & విట్నీ, ఐఏఈ ఏజీ ఇంజిన్లతో నడుస్తున్నాయి. భారతదేశంలో ఇండిగో, గో ఎయిర్, ఎయిర్ కోస్టాలతో నూతన ప్యూర్ పవర్ పిడబ్ల్యూ 1000జి కుటుంబానికి చెందిన ఇంజిన్ల సేవలను పొందనుండడంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

ఈ సందర్భంగా ప్రాట్ & విట్నీ కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్రూ టానర్ మాట్లాడుతూ 'ఆసియా, భారత్‌లో మా కస్టమర్లకు చేరువలో ఈ నూతన శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పడంతో పాటుగా కస్టమర్ సపోర్ట్ అన్ని అంశాల్లోనూ సంసిద్దతపై మేము ఎంతగానో దృష్టి సారించాం' అని అన్నారు.

 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ప్రాట్ & విట్నీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ప్రాట్ & విట్నీ


'మా కస్టమర్లు మా నుంచి మరీ ముఖ్యంగా మత ప్లీట్‌లోకి నూతన ఇంజిన్లను ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు అత్యున్నత స్థాయి మద్దతును కొరుకుంటారు. దాన్ని అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని అన్నారు. ఈ కస్టమర్ శిక్షణ కేంద్రం జీటీఎఫ్, వి2500 ఇంజిన్లకు సంబంధించిన కస్టమర్లకు కీలక శిక్షణను అందించనుంది.

 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ప్రాట్ & విట్నీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ప్రాట్ & విట్నీ


ఏడాదికి ఒక వారం రోజుల పాటు చొప్పున ఏటా 2,000 మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే సామర్ధ్యం ఈ శిక్షణ కేంద్రానికి ఉంది. ఈ వార్షిక సామర్థ్యాన్ని 4,000 మందికి పెంచున్నారు. ప్రాట్ & విట్నీ అంతర్జాతీయ స్ధాయి ఈస్ట్ హోర్ట్ ఫోర్డ్, బీజింగ్ శిక్షణ కేంద్రాలకు ధీటుగా భారత్‌లోని హైదరాబాద్‌లో రూపుదిద్దుకున్న ఈ మూడో శిక్షణ కేంద్రం భారత్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌లో శిక్షణ అవసరాలను తీర్చగలుతుందన్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ప్రాట్ & విట్నీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ప్రాట్ & విట్నీ


ఏవియేషన్ ఎడ్యుకేషన్, శిక్షణను మరితంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భాగంగా, భారతదేశంలోని వారికి అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ఏవియేషన్ అండ్ ఇంజినీరింగ్ డిగ్రీ అవకాశాలను అందించేందుకు వీలుగా ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ ఆసియాతో ప్రాట్ & విట్నీ ఒక అవగాహాన ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ప్రాట్ & విట్నీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ప్రాట్ & విట్నీ


ఏవియేషన్ అండ్ ట్రైనింగ్‌ను వృద్ధి చేయడంలో, కార్పోరేట్ స్కాలర్ షిప్స్ విషయంలో, పరిశోధనలో అవకాశాలు కల్పించడంలో ఆసియా దేశాల విమాన రంగ సిబ్బందికి ఇది ప్రయోజనం కల్పించనుంది.

English summary
Pratt & Whitney, a United Technology company, today inaugurated their India Training Centre close to the Rajiv Gandhi International Airport, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X