18న నగరానికి రాష్ట్రపతి ప్రణబ్ రాక: షెడ్యూల్ ఇదే

హైదరాబాద్: ఈనెల 18వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 18 నుంచి 31 వరకు ఆయన హైదరాబాద్‌లో ఉండనున్న నేపథ్యంలో రాష్ట్రపతి బస నుంచి భద్రత వరకు అన్ని ప్రభుత్వ విభాగాలూ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్రపతి నిలయం వరకు ఉన్న రోడ్లను అందంగా ముస్తాబు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 18 మధ్యాహ్నాం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ గవర్నర్ నరసింహాన్‌తో పాటు సీఎం కేసీఆర్ తదితరులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు.

ఆరోజు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. 19వ తేదీన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో నిర్వహించనున్న స్నాతకోత్సవానికి హాజరవుతారు. 20, 21 తేదీల్లో రాష్ట్రపతి భవన్ లోనే గడుపుతారు. 22వ తేదీన బెంగుళూరుకు వెళతారు.

President Pranab Mukherjee to visit Hyderabad for a customary Southern sojourn from 18 December

23 తేదీన తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో జరిగే ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ ఆన్యువల్ కాంగ్రెస్‌కు హాజరవుతారు. సీఎం కేసీఆర్ నిర్వహించే చండీ యాగానికి 27వ తేదీన హాజరవుతారు.

తిరిగి 31వ తేదీ ఉదయం 11 గంటలకు హాకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి విడిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం ప్రాంగణానికి అవసరమైన అన్ని సౌకర్యాలనూ రక్షణశాఖకు చెందిన ఎంఈఎస్ ద్వారా కల్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+