ముగిసిన దక్షణాది విడిది: రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గవర్నర్, సిఎం(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ భారత విడిది ముగిసింది. పది రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ బుధవారం ఢిల్లీ తిరిగి వెళ్లారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పూలబొకేలు ఇచ్చి రాష్ట్రపతికి తుదివీడ్కొలు పలికారు.
వీడ్కోలు సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతికి పాదాభివందనం చేశారు. హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కాగా, జూన్ 29న హైదరాబాద్ వచ్చిన ప్రణబ్.. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. తిరుమల, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాలను సందర్శించారు.
ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు పలికిన వారిలో శాసనసభ సభాపతి మధుసూదనాచారి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు ఉన్నారు.

రాష్ట్రపతికి వీడ్కోలు
హైదరాబాద్ నగరంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ భారత విడిది ముగిసింది.

రాష్ట్రపతికి వీడ్కోలు
పది రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ బుధవారం ఢిల్లీ తిరిగి వెళ్లారు.

రాష్ట్రపతికి వీడ్కోలు
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పూలబొకేలు ఇచ్చి రాష్ట్రపతికి తుదివీడ్కొలు పలికారు.

రాష్ట్రపతికి వీడ్కోలు
వీడ్కోలు సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతికి పాదాభివందనం చేశారు.

రాష్ట్రపతికి వీడ్కోలు
హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

రాష్ట్రపతికి వీడ్కోలు
జూన్ 29న హైదరాబాద్ వచ్చిన ప్రణబ్.. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. తిరుమల, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాలను సందర్శించారు.

రాష్ట్రపతికి వీడ్కోలు
ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు పలికిన వారిలో శాసనసభ సభాపతి మధుసూదనాచారి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications