నేడు 9 వందే భారత్ రైళ్ళు ప్రధాని మోడీచే ప్రారంభం.. పూర్తి వివరాలివే!!

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ (pm modi) నేడు 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ఈ తొమ్మిది రైళ్లను జెండా ఊపి ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి.

వివిధ రాష్ట్రాల్లోని మతపరమైన మరియు పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 9 వందే భారత్ రైళ్లను (vande bharat trains) ప్రధాని నరేంద్ర మోడీ నేడు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొంటారు. ఈ రైళ్ళు 11 రాష్ట్రాలలో వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తాయి.

Prime Minister Modi launching 9 vande bharat trains today.. here is the Full details!!

కేరళ రాష్ట్రంలో కాసర గోడ్- తిరువనంతపురం, రాజస్థాన్లో జైపూర్ నుండి ఉదయపూర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడ నుండి చెన్నై, తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి నుండి చెన్నై, గుజరాత్ లోని జామ్ నగర్ నుండి అహ్మదాబాద్ వరకు, ఝార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో రాంచి నుండి హౌరా వరకు నడవనున్నాయి.

తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో సికింద్రాబాద్ కాచిగూడ నుండి బెంగళూరు యశ్వంతపూర్ వరకు, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పాట్నా నుండి హౌరా వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. పండుగల సీజన్లో ప్రారంభమవుతున్న వందే భారత్ రైళ్లు ప్రయాణికుల ప్రయాణ అనుభూతిని మెరుగు పరుస్తాయి. వివిధ మతపరమైన ప్రాంతాలను కలుపుతూ ఈ రైళ్లు తిరగ నున్నాయి.

పుణ్యక్షేత్రాలైన పూరి, మధురై లను, తిరుపతికి కనెక్టివిటీని కలిగిన ఈ రైళ్ళు సెమీ హై స్పీడ్ సిరీస్ లో వస్తున్న రైళ్లు . ఈ రైళ్ల వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న క్రమంలోనే నేడు మరో తొమ్మిది రైళ్ళను ప్రారంభిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+