Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణాలో మూసివేత దిశగా ప్రైవేట్ కాలేజీలు; గత ఏడేళ్ళలో మూతపడిన ప్రైవేట్ కాలేజీలెన్నో తెలిస్తే షాక్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విభజన జరిగిన తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి గందరగోళంలో పడింది. గత ఏడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటుగా, ఇతర ప్రొఫెషనల్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు మూతపడిన పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యా వ్యవస్థ దూసుకుపోతుంది అని భావించిన తెలంగాణ రాష్ట్రంలో చాలా కళాశాలలు నడపలేక మూతపడడం వెనుక అనేక కారణాలున్నాయి.

తెలంగాణా రాష్ట్రంలో భారీగా మూతపడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు

తెలంగాణా రాష్ట్రంలో భారీగా మూతపడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లతో పాటుగా, అనేక ప్రొఫెషనల్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు మూతపడుతున్న క్లిష్ట పరిస్థితికి ప్రభుత్వమే కారణమని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మరోవైపు వివిధ కళాశాలల్లో ఆఫర్ చేస్తున్న కోర్సులకు డిమాండ్‌ లేకపోవడంతో కాలేజీలను మూసివేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా కరోనా మహమ్మారి కారణంగా కూడా విద్యాసంస్థలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో కూడా పలు విద్యాసంస్థలు మూతపడిన పరిస్థితి నెలకొంది.

డిమాండ్ లో లేని కోర్సులు, ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వని సర్కార్ తీరుతో మూసివేత

డిమాండ్ లో లేని కోర్సులు, ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వని సర్కార్ తీరుతో మూసివేత


ఫీజు రీయింబర్స్మెంట్ ల విడుదల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం, రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ యూనివర్సిటీ లో ఉన్న డిగ్రీ కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపించకపోవడం, పలు కోర్సులకు అసలే డిమాండ్ లేకపోవడం వెరసి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలలు నడపలేని స్థితి నెలకొంది.రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడానికి, ఆధునిక సమాజంలో అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు సరైన కోర్సులను రూపొందించి అందించడానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం, ఎప్పటినుండో ఉన్న పాత కోర్సులను కళాశాలలు అందించాలని సూచించడం వెరసి ప్రైవేట్ కళాశాలల పరిస్థితి దయనీయంగా మారింది

ఏడేళ్ళలో మొత్తం 705 ప్రొఫెషనల్ ప్రైవేట్ కళాశాలలు మూసివేత

ఏడేళ్ళలో మొత్తం 705 ప్రొఫెషనల్ ప్రైవేట్ కళాశాలలు మూసివేత

తెలంగాణ రాష్ట్రంలో కళాశాలల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతోంది. గత ఏడేళ్లలో, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంసీఏ మరియు ఎంబీఏ కోర్సులకు సంబంధించిన కళాశాలలు మొత్తం 705 ప్రైవేట్ కళాశాలలు మూసివేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడం ఈ కళాశాలల మూసివేతకు గల ప్రధాన కారణాలలో ఒకటిగా తెలుస్తుంది. 2014-15లో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ , ఎంటెక్, ఎం ఫార్మసీ, బీఈడీ కళాశాలల సంఖ్య 3703 ఉండగా, ప్రస్తుతం 2998కి తగ్గింది.

డిగ్రీ, జూనియర్ కళాశాలలకు కష్టం.. భారీగా మూసివేతలు

డిగ్రీ, జూనియర్ కళాశాలలకు కష్టం.. భారీగా మూసివేతలు


డిగ్రీలు, జూనియర్ కాలేజీల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గతంలో డిగ్రీ కాలేజీలు 1680 ఉండగా ప్రస్తుతం 886కి తగ్గాయి.డిగ్రీ కళాశాలలు 794వరకు మూత పడ్డాయి. డిగ్రీ కోర్సులకు పెద్దగా డిమాండ్ లేకపోవడం, జూనియర్ కళాశాలలు సైతం నడవలేని స్థితి రావడంతో వీటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 2600కి పైగా ఉన్న జూనియర్ కాలేజీలు ఇప్పుడు 1785కి తగ్గాయి. 815 జూనియర్ కాలేజీలు మూత పడ్డాయి. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని మా వల్ల కాదని చేతులెత్తేశాయి.

మొత్తం 2314 కళాశాలల మూసివేత .. ఉన్నత విద్యా ప్రమాణాలు ఎక్కడ?

మొత్తం 2314 కళాశాలల మూసివేత .. ఉన్నత విద్యా ప్రమాణాలు ఎక్కడ?


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2314 డిగ్రీ, జూనియర్‌, ఇతర ప్రొఫెషనల్‌ కాలేజీలు మూతపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ కాలేజీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల మూసివేత రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+