దేశానికి మీలాంటివారే స్ఫూర్తి: తెలంగాణ రీసెర్చ్ స్కాలర్‌పై ప్రియాంక గాంధీ ప్రశంసలు
హైదరాబాద్: తెలంగాణకు చెందిన రీసెర్చ్ స్కాలర్ అయిన ఓ యువకుడిపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలోని మారుమూల గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు కరోనావైరస్ లక్షణాలున్న
వారి రక్త నమూనాలు సేకరించడానికి 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో వరకు ప్రయాణించారు.
మైక్రో బయాలజీలో పరిశోధన చేస్తున్న రామకృష్ణ.. ప్రస్తుతం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో రక్త నమూనాల పరీక్షలు చేస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న ప్రియాంక గాంధీ.. ఆ యువకుడిని ప్రశంసిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

'ఇదే మన ఇండియా. ఇటువంటి సైనికులు మనదేశంలో లక్షల మంది ఉన్నారు. వీరే మనకు గర్వకారణం. లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. వారందరినీ గౌరవిద్దాం. వారి సేవాతత్పరతను ప్రోత్సహిద్దాం' అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ సేవలు అందించడం అభినందించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు. అయితే, రామకృష్ణ లాక్‌డౌన్‌కి ముందే హైదరాబాద్‌కి చేరుకుని.. అక్కడ్నుంచి విమానంలో లక్నో చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడే పరిశోధనలు చేస్తున్నారు.
तेलंगाना के रामकृष्णा जी 1500 किमी दूर लखनऊ पहुंचकर कोरोना के खिलाफ लड़ाई में अपनी सेवाएं देने लगे। वो एक शोध छात्र हैं और अभी केजीएमयू में टेस्ट सैंपल लेने में सहायता कर रहे हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 9, 2020
ये हमारा भारत है।..1/2https://t.co/afQBmqyb1a












Click it and Unblock the Notifications