Priyanka Reddy murder: షాకింగ్ అంశాలు వెలుగులోకి.. ప్రధాన నిందితుడి ఫొటో రిలీజ్!
దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న ప్రియాంకారెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ దారుణ ఘటనకు కారణమైన వారిలో ప్రధాన నిందితుడిని పోలీసు శాఖ గుర్తించింది. ఈ మేరకు నిందితుడిని ఫోటోను మీడియాకు విడుదల చేశారు. ఇప్పటికే ప్రియాంక రెడ్డి హత్య కేసును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై అన్ని వర్గాలు తీవ్ర నిరసన, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

దిగ్బ్రాంతికి గురిచేస్తున్న అంశాలు
ప్రియాంక రెడ్డి హత్య కేసులో బయటపడుతున్న అంశాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. బాధితురాలిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్టు పోలీసుల ప్రాథమికంగా సమాచారం. కొత్తూరు పెట్రోల్ బంక్‌లో ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ కొనుగోలు చేసినట్టు తెలిసింది. కొత్తూరు నుంచి షాద్ నగర్ వైపు వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

24 గంటలలోపే
డాక్టర్ ప్రియాంకరెడ్డిపై లైంగికదాడి, సజీవ దహనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నారాయణపేట జిల్లాకు చెందిన మహ్మద్ పాషాను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆయనతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video

మహిళా కమిషన్ సుమోటోగా
డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసుపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషాద ఘటనపై నెటిజన్లు, సామాన్య ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో వాస్తవ అంశాలు ఏమిటనే విషయంపై సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం.

జాతీయ కమిషన్ రంగంలోకి
మరో నిర్భయ లాంటి ఘటన అంటూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్న క్రమంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ దారుణ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకొన్న కమిషన్ తీవ్రమైన చర్యలను తీసుకొనేందుకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications