బాబు, కేసీఆర్ కొట్టుకుంటే బీజేపీ చూస్తోంది: యాష్కీ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడుల పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు సీఎంలు కొట్టుకుంటుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందన్నారు.

ఇరువురు సీఎంలు ఇలాగే పాలిస్తే అమావాస్య చంద్రుడిలా మిగిలిపోవడం ఖాయమన్నారు. ఇద్దరు సీఎంలు చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. తెలంగాణను దోచుకున్న వారికే కేసీఆర్ కితాబివ్వడం ఏమాత్రం సరికాదన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని మండిపడ్డారు.

Problems will solve by discussions: Madhu Yashki

ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులెందుకు ఇస్తున్నారు: జీవన్‌ రెడ్డి

గతంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇస్తున్నారని ఆరోపించిన కేసీఆర్‌ ఇప్పుడు వారికే ఎందుకు కాంట్రాక్టు పనులు ఇస్తున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్‌రహదారిపై హౌస్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైందన్నారు.

బాబు పర్యటనకు నిరసగా న్యాయవాదుల ర్యాలీ

వరంగల్‌లో చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ న్యాయవాదులు కోర్టునుంచి ర్యాలీగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు హన్మకొండ అంబేదర్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ జెండాలను ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు దహనం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+