హైకోర్టుకు ప్రభాస్, చిరు సినిమాల నిర్మాతలు.. టికెట్ రేట్లపై ఉత్కంఠ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ జనవరి 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సెన్సార్ పూర్తి అయింది. రెండు సినిమాలకూ యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.
అయితే టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి కోసం తాజాగా ఈ రెండు సినిమాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలు పెంచకుండా గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్ పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పు ఆధారంగా టికెట్ రేట్లు, ప్రీమియర్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూళ్లు రాబట్టడం కష్టమని ఇరు చిత్రాల నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఇక రాజాసాబ్ ప్రీమియర్స్ జనవరి 8 న ఉండనున్నాయి. జనవరి 7 నుంచి నైజాంలో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని సమాచారం. మూవీ జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్దమైంది. రాజాసాబ్ ఫైనల్ రన్ టైమ్ సుమారు 175 నిమిషాలు.. అంటే దాదాపు 2 గంటలు 55 నిమిషాలుగా లాక్ చేసినట్టు సమాచారం.
-
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!!












Click it and Unblock the Notifications