వ్యభిచార ముఠా పట్టివేత: గణేష్ నిమజ్జనం ఘర్షణలో ఒకరి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఓ హోటల్‌లో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాతబస్టీలో చోరీ
ఇదిలావుంటే, పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. 14 తులాల బంగారం, రెండు సిలిండర్లు, నాలుగు సెల్‌ఫోన్లు దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మొబైల్ షాప్‌లో దొంగతనం
సికింద్రాబాదులోని చిలకలగూడాలో భారీ చోరీ జరిగింది. యో మొబైల్ షాప్‌లో శుక్రవారం అర్థరాత్రి ఈ దొంగతనం జరిగింది. షాప్ వెనుక భాగంలో గోడలు బద్దలు కొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోని రు. 5 లక్షల విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం గమనించిన షాపు యజమానులు పోలీసులు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు పరిశీలించారు.
గణేష్ నిమజ్జంలో ఘర్షణ
నల్లగొండ జిల్లాలో జరిగిన గణేష్ ఉత్సవాలాల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని దామచర్ల మండలం వాడపల్లిలో శనివారంనాడు జరిగింది.
నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఘర్షణ జరిగింది. ప్రత్యర్థుల దాడిలో మిర్యాలగుడా మండలం వెంకటాద్రిపాళెం గ్రామానికి చెందిన నర్సయ్య (65) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇరు వర్గాలు మద్యం సేవించి ఉన్నందున మాటామాటా పెరిగింది. ఈ గొడవలో నర్సయ్యను కొట్టి చంపారు.












Click it and Unblock the Notifications