పశ్చిమబెంగాల్ యువతులతో వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు
హన్మకొండలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. హన్మకొండ లోని రెడ్డి కాలనీలో వ్యభిచారం నడుస్తుందని సమాచారంతో దాడి చేసిన పోలీసులు పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతులను, ఇద్దరు విటులను, వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

హన్మకొండ నడిబొడ్డున వ్యభిచారం .. రంగంలోకి టాస్క్ ఫోర్స్
టాస్క్ ఫోర్స్ ఏసిపి డాక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లారెడ్డి కాలనీకి చెందిన ఒక మహిళ ఇల్లు అద్దెకు తీసుకొని పశ్చిమ బెంగాల్ నుండి మహిళలను తీసుకువచ్చి గత సంవత్సరం నుండి అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. సులభంగా డబ్బులు సంపాదించడం కోసం వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న సదరు మహిళ పై అనుమానంతో పలువురు పోలీసులకు సమాచారం అందించగా టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.

మహిళతో మరికొందరి ఒప్పందం.. పశ్చిమ బెంగాల్ యువతులతో వ్యభిచారం
ఎస్సీ కాలనీ, జీవన్ నగర్, శ్యాం పేట్ కు చెందిన విటులు మరిపెల్లి. స్టీఫెన్, మరిపెల్లి. పీటర్ లు సదరు మహిళతో ఒప్పందము కుదుర్చుకొని వ్యభిచారం చేయిస్తున్నారు. ఇక దాడి చేసిన పోలీసులు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు బాధిత మహిళలను కాపాడి, నిర్వాహకురాలు అయిన కుతాటి. నందిని, స్టీఫెన్, పీటర్ లను అరెస్టు చేశారు.
అడిషనల్ టాస్క్ ఫోర్స్ డి సి పి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ సూచనల మేరకు రెడ్డి కాలనీ, హనుమకొండలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను మరియు విటుడులను టాస్క్ ఫోర్స్ మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా రైడ్ నిర్వహించి అరెస్టు చేసినట్టు సమాచారం .వారిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వ్యభిచారం చేస్తూ పదేపదే దొరికితే పీడీ యాక్ట్ పెడతామన్న సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఈ వ్యభిచార ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు. తరుణ్ జోషి మాట్లాడుతూ ఎవరైనా ఈ విధంగా ప్లాన్ చేసుకుని, గ్రూపులుగా ఏర్పడి మహిళలతో వ్యభిచారం చేయించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే వృత్తిగా చేసుకొని రూములు తీసుకొని వ్యభిచారం చేస్తూ పదే పదే దొరికిన నిర్వాహకులపై పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications