బండి సంజయ్ అరెస్ట్: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత, పోలీసు వాహనం బానెట్‌పైకి ఎక్కి..!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద బండి సంజయ్ దీక్షకు దిగారు. అయితే, ఈ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు.
అయినప్పటికీ బండి సంజయ్ అక్కడే దీక్ష కొనసాగించారు. భారీ ఎత్తున బీజేపీ నేతలు, శ్రేణులు అక్కడికి తరలివచ్చారు. దీక్ష చేస్తున్న బండి సంజయ్ తో పోలీసులు కాసేపు చర్చలు జరిపారు. ఆ తర్వాత పోలీసులు కాస్త వెనక్కి తగ్గడంతో బండి సంజయ్ దీక్షను కొనసాగించారు. ఆ తర్వాత దీక్ష ముగించే సమయంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని బండి సంజయ్(bandi sanjay) ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసులను మోహరించారు.
గన్ పార్క్ వద్ద శ్రీ @bandisanjay_bjp అరెస్ట్ దృశ్యాలు pic.twitter.com/iAZNUtYEWG
— BJP Telangana (@BJP4Telangana) March 17, 2023

గన్‌పార్క్ నుంచి టీఎస్ పీఎస్సీకి బయలుదేరిన బీజేపీ నేతలను, బండి సంజయ్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్రం చేశారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆ తర్వాత బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలిస్తుండగా.. మరోసారి బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు పోలీసు వాహనం బానెట్ పై ఎక్కి బండి సంజయ్ అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి బండి సంజయ్‌ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
#WATCH | Hyderabad: Telangana BJP president Bandi Sanjay sits on a day-long hunger strike at the state party headquarters demanding that the state govt order a judicial inquiry by a sitting HC judge into the alleged Telangana State Public Service Commission (TSPSC) paper leak. pic.twitter.com/BLhSrNQRgl
— ANI (@ANI) March 17, 2023
కాగా, బండి సంజయ్, భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు వారి పార్టీ కార్యాలయం నుంచి గన్ పార్క్‌కు పాదయాత్ర చేపట్టారు. అనంతరం గన్ పార్క్ వద్ద దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా వెళుతుండగా బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
గన్‌పార్క్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.
— Neeraj Goud Gollapelli 🚩 (@NeerajGoudBJP) March 17, 2023
పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట. గన్‌పార్క్ దగ్గర @bandisanjay_bjp మరియు @Eatala_Rajender గారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టిన బీజేపీ కార్యకర్తలు. pic.twitter.com/xbYzXlvojz
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications