టీఆర్ఎస్ పాలనపై భగ్గుమన్న పురంధరేశ్వరి .. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో హాట్ కామెంట్స్
ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపధ్యంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ సేన దూకుడుగా ముందుకు వెళ్తుంది . తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతోంది . ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. తాజాగా ఏపీ బిజెపి నాయకురాలు, బీజేపీ జాతీయ కార్యదర్శి పురందరేశ్వరి ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

బీజేపీకి ఖమ్మంలో సానుకూల వాతావరణం ఉందన్న పురంధరేశ్వరి
ఖమ్మంలో బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోందని పురందరేశ్వరి పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా దేశ సమగ్రాభివృద్ధికి కోసం పని చేయడం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో సాధ్యమవుతుందని దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు.
ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పురంధరేశ్వరి టీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరు సంవత్సరాల కెసిఆర్ పాలనలో ఖమ్మంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు పురంధరేశ్వరి .

మంత్రి పువ్వాడపై పురంధరేశ్వరి తీవ్ర విమర్శలు
ఖమ్మంలో బినామీ కాంట్రాక్టర్లదే రాజ్యమని ఆరోపణలు గుప్పించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ మంత్రికి ఓటమి భయం పట్టుకుందని అందుకే తన భార్యను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించారని దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. తన కాలేజీ వ్యాపారాల కోసం సదరు మంత్రి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు దగ్గుబాటి పురంధరేశ్వరి . ఖమ్మం ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని దగ్గుబాటి పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు.

ఖమ్మం అభివృద్ధికి అడ్డు పడుతున్న మంత్రిపై ఆలోచించాలని వ్యాఖ్యలు
అంతేకాదు 117 కోట్ల అమృత్ పథకం కింద ఖమ్మం కార్పొరేషన్ కు మంజూరయ్యాయని అవి కేంద్ర ప్రభుత్వ నిధులని స్పష్టం చేశారు. ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని అడ్డుకున్న శక్తులు ఎవరనేది గుర్తించాలని, ఖమ్మంలో యూనివర్సిటీ పెడతామని చేసిన వాగ్దానం ఏమైంది అని ప్రశ్నించిన పురంధరేశ్వరి ఖమ్మం అభివృద్ధికి ఆ మంత్రి అడ్డుపడుతున్నారు అంటూ ఆ మంత్రి వైఖరిపై ఆలోచించాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు దగ్గుబాటి పురంధరేశ్వరి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications