గ్రేటర్ ఫైట్‌లో పురంధేశ్వరి: కెసిఆర్ మాటల మనిషంటూ వ్యాఖ్య
హైదరాబాద్: అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాటలతోనే సరి పెడుతున్నారని, ఎలాంటి చేతలు లేవని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. హైదరాబాదులోని సైదాబాద్‌లో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలు నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు.
18 నెలల పాలనలో తెలంగాణకు ఏమీ చేయలేని ముఖ్యమంత్రి మిగతా కాలంలో ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఓటు వేసే సమయంలో హైదరాబాద్ ప్రగతి, ప్రజల సంక్షేమం ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

తెలుగుదేశం, బిజెపి గతంలో చేసిన అభివృద్ధిని స్మరించుకొని ఓటు వేయాలని సూచించారు. పేదలందరికీ ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో గ్రేటర్‌లో కేంద్ర ప్రభుత్వం 55,507 ఇళ్లను కేటాయించారని ఆమె చెప్పారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రాసేనారెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, సంరెడ్డి శైలజాసురేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications