మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు, అరెస్ట్ పైన రాచకొండ సీపీ కీలక ప్రకటన!
మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు సద్దుమణగలేదు. రోజురోజుకీ గొడవలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి కేసులు నమోదయ్యేలా రచ్చ చేయగా, తాజాగా సోదరుడి పైన మంచు మనోజ్ మరో మారు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.
మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు
తన ఫ్యామిలీని చంపేందుకు విష్ణు కుట్ర చేస్తున్నాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు విష్ణు పైన మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.
పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని మంచు మనోజ్ పేర్కొన్నారు. తన తల్లి బర్త్ డే ను అడ్డం పెట్టుకొని తన ఇంట్లోకి వచ్చి జనరేటర్ లో డీజిల్ కలిసిన షుగర్ పోశారని ఇది చూసిన వారిని మంచు విష్ణు బెదిరించారన్నారు.

మంచు ఫ్యామిలీ గొడవలపై కీలక ప్రకటన చేసిన రాచకొండ సీపీ
ఎవరికీ చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా లో భయంకరమైన హెచ్చుతగ్గులు జరిగాయని తమకు విష్ణుతో ప్రమాదం పొంచి ఉందని మంచు మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఈ వివాదం కొనసాగుతుండగా తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మంచు ఫ్యామిలీ గొడవలపైన కీలక ప్రకటన చేశారు. ఇప్పటికీ మంచు మోహన్ బాబు కుటుంబం పైన మూడు FIRలు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.
మోహన్ బాబు అరెస్ట్ పై సీపీ క్లారిటీ
అలాగే ప్రస్తుతం వారి కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని లీగల్ గా ఎలా ముందుకు వెళ్లాలో అలానే వెళతామని తెలిపారు. ఇక మంచు మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎటువంటి ఆలస్యం లేదని కూడా వెల్లడించారు. ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసు ఇచ్చామని అయితే ఆయన 24వ తేదీ వరకు టైం అడిగారని పేర్కొన్నారు. కోర్టు కూడా ఆయనకు టైం ఇచ్చింది కాబట్టి అరెస్టు చేయలేదన్నారు.
మోహన్ బాబు గన్స్ పై క్లారిటీ ఇచ్చిన పోలీస్ కమీషనర్
ఇక మోహన్ బాబుని విచారించడం కోసం తాము కోర్టును ఆశ్రయిస్తామని సి పి సుధీర్ బాబు తెలిపారు. ఇప్పటికే మోహన్ బాబు వద్ద ఉన్న గన్ లు కూడా చంద్రగిరి లో ఉన్నప్పుడు తీసుకున్నవని, రాచకొండ కమీషనరేట్ నుండి ఎటువంటి పర్మిషన్ గన్స్ ఆయన దగ్గర లేవని తెలిపారు. ప్రస్తుతం ఆయన దగ్గర రెండు గన్స్ ఉన్నాయని, డబుల్ బ్యారెల్ ఒకటి స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉందని వివరించారు.
నోటీసులకు స్పందించకుంటే అరెస్ట్
ఇక మోహన్ బాబు కు మరో మారు నోటీసు ఇస్తామని తెలిపిన సిపి 126 బి ఎన్ ఎస్ ఎస్ ద్వారా ఆయన సమయం అడగవచ్చునని పేర్కొన్నారు. మోహన్ బాబు నోటీసులకు స్పందించకపోతే అరెస్టు చేస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications