ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా.. రాధాకృష్ణన్ నియామకం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్‌ను హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేశారు.

ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం గురువారం సిఫారసు చేసింది. ఇంతకు ముందు ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ దిలీప్ భోసాలే 2016 జూలై వరకు పనిచేశారు.
ఆ తరువాత ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది.
అప్పటి నుంచి ఉమ్మడి హైకోర్టుకు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను కొలీజియం నియమించింది.

 Radhakrishnan is New Chief Justice of Telangana AP High Court

హైదరాబాద్ హైకోర్టుతో పాటు మరో నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, కేరళ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లను కొలీజియం ఖరారు చేసింది.

కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జ్యోతిర్మయ్ భట్టాచార్యను ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్‌ను హిమాచల్‌ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ అభిలాషా కుమారిని మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఇక కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆంటోనీ డామినిక్‌ను అదే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Justice Thottathil Bhaskaran Nair Radhakrishnan, the Chief Justice of Chhattisgarh High Court, has been transferred as Chief Justice of Hyderabad High Court for Andhra Pradesh and Telangana state. With this transfer the Hyderabad High Court will get a regular Chief Justice after nearly two years. The Supreme Court Collegium made this recommendation along with those for four other High Courts. The Collegium has recommended the transfer of Calcutta High Court Acting Chief Justice Jyotirmay Bhattacharya as Chief Justice of the same court. Justice Anirudha Bose, Judge of Calcutta HC is being elevated as Chief Justice of Delhi High Court. Till now, Justice Gita Mittal was the Acting Chief Justice of the Delhi HC.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి