రాష్ట్రంలో కొత్త పథకం.. ఇలా చేస్తే రూ. 25 వేలు నేరుగా మీ అకౌంట్ లోకి..!

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. రోడ్లపైకి వచ్చినప్పుడు రూల్స్ పాటించకుండా కొందరు, అనుకోకుండా ప్రమాదాలు జరిగి మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు బాధితుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయి. అంతేకాదు వారికి సామాజిక, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణలో ప్రతీ ఏటా సగటున 22,000 నుంచి 23,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో 7,500 నుంచి 7,800 మంది మరణిస్తున్నారు. 4,40,000 పైగా గాయపడుతున్నారు.

ఇక 2024తో పోలిస్తే 2025లో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు 5.6 శాతం పెరిగినట్లు తెలంగాణ డీజీపీ వార్షిక నివేదికలో వెల్లడించారు. 2025 అక్టోబర్ వరకు దాదాపు 22,441 ప్రమాదాలు జరగ్గా 6,221 మంది ప్రాణాలు కోల్పోయారు. 2024 లో అయితే మొత్తం 25,986 ప్రమాదాలు సంభవించగా ఇందులో 7,949 మంది మరణించారు. అలాగే 23,600 మందికి పైగా గాయపడ్డారు.

అయితే రోడ్డు ప్రమాదాల్లో బాధితులను ఆదుకోవడంలో ప్రజలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా రహ-వీర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ.25,000 బహుమతి అందిస్తోంది. నగదుతోపాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తుంది. ఇక ఈ రివార్డుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం.. ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

RahVeer Hero Alert Help Accident Victims and Earn upto 25 000 Cash Reward by Telangana sarkar

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చిన వ్యక్తి వివరాలను ఆసుపత్రి సిబ్బంది లేదా పోలీసులు నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత జిల్లా స్థాయి కమిటీ ఆ వివరాలను, ప్రమాద తీవ్రతను పరిశీలిస్తుంది. ఈ మేరకు సదరు వ్యక్తికి రివార్డు ఇవ్వాల్సిందిగా రవాణా కమిషనర్‌ కు సిఫార్సు చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+