సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే ప్రయాణీకులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!!

రైల్వే అధికారులు ప్రయాణీకులకు కీలక అప్డేట్ ఇచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ కారణంగా పలు ప్రధాన రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి నిర్వహిస్తున్నారు. చర్లపల్లి, లింగంపల్లి నుంచి కొన్ని రైళ్లను మళ్లించారు. సికింద్రాబాద్ నుంచి కొన్ని ప్రధాన రైళ్లు కొనసాగుతున్నాయి. అదే సమయంలో పదో నెంబర్ ప్లాట్ ఫాం నుంచి ప్రస్తుతం ప్రయాణీకులను అనుమతిస్తున్నారు. కాగా, రైల్వే అధికారులు ప్రయాణీకుల సౌకర్యార్ధం కీలక నిర్ణయం తీసుకున్నారు.

దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి రద్దీ వేళ పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. సికింద్రాబాద్ మీదుగా కొన్ని దూర ప్రాంతపు రైళ్లు కొనసాగుతున్నాయి. కాగా, సికింద్రాబాద్​ స్టేషన్​ పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రయాణికులు గందరగోళానికి తెర దించుతూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణీకుల ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది.

railway-officials-key-decision-over-operations-from-secunderabad-station-details-here

అందులో భాగంగా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో 17 బుకింగ్‌ కౌంటర్లు, 20 ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్లు (ఏటీవీఎం) అందుబాటులో ఉన్నాయి. టికెటింగ్‌ సేవల కోసం రైల్‌ వన్‌ మొబైల్‌ యాప్‌ను వినియోగించడంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా రైల్వే శాఖ 'రైల్‌ వన్‌' మొబైల్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపు పద్ధతులతో టికెట్‌ బుక్‌ చేసే అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లపై ఇటీవల 3 శాతం రాయితీ ప్రకటించింది.

అయితే, టికెట్ల పై రాయితీ అమలు సమయం ఖరారు చేసారు. ఈ అవకాశం ఈ నెల 14 నుంచి జులై 14 వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో.. పండుగ వేళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొనేందుకు సికింద్రాబాద్ స్టేషన్ లో పండగ నేపథ్యంలో స్టేషన్‌లో టీటీఈలు, ఆర్‌పీఎఫ్‌ బృందాలను నియమించారు. సీసీ టీవీ నిఘా, డివిజనల్‌ హెడ్‌క్వార్టర్స్‌లో వార్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. స్టేషన్‌ ఆధునికీకరణ పనుల కారణంగా తాత్కాలికంగా పార్కింగ్​ నిలిపివేశారు. ప్లాట్‌ఫాం-1 వద్ద పరిమిత పికప్, డ్రాప్‌ ఆఫ్‌ మాత్రమే అందుబాటులో ఉంది.

ప్లాట్‌ఫాం నం.10 వద్ద బేస్‌మెంట్‌ పార్కింగ్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా బోయిగూడ ప్రవేశమార్గం (ప్లాట్‌ఫాం- 10) వైపు యాక్సెస్‌ కంట్రోల్‌ వ్యవస్థను తాత్కాలికంగా తొలగించి ప్రయాణికుల కదలికలను మరింత వేగవంతం చేశారు. జనవరి 20వ తేదీ వరకు హైటెక్‌ సిటీలో 16 రైళ్లకు, చర్లపల్లి స్టేషన్​లో మరో 11 రైళ్లకు అదనపు స్టాపేజీలు కల్పించారు. లింగంపల్లిలో 10 రైళ్లకు ఏప్రిల్‌ 30వ తేదీ వరకు తాత్కాలిక స్టాపేజీ కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+