రైల్వే పాస్ ల జారీలో తాజా మార్పులు- ఇక నుంచి..!!

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే పాసుల జారీలో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఇందు కోసం ఇప్పటి వరకు పాస్ లు పొందటంలో ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ తాజా నిర్ణయం వెల్లడించింది. రైల్వేశాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌లో పాసులతోపాటు ఈ-టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు పాస్ ల కోసం దివ్యాంగులు సైతం స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌ విధానంతో రెన్యువల్ తో పాటుగా కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన కార్డులను పొందేలా మార్పులు చేసారు.

రైల్వే శాఖ ఆన్‌లైన్‌ విధానంలో పాసుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రైల్యేశాఖ వైబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే యూనిక్‌ డిజేబులిటీ కార్డు వస్తుంది. అలాగే పాత వాటిని రెన్యువల్ చేసుకొనే అవకాశం కల్పించింది. ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్‌ పాస్‌ ఐడీ కార్డు పొందవచ్చని అధికారులు వెల్లడించారు. దివ్యాంగులు తమ రాయితీ రైల్వే పాస్ కోసం https://divyangjanid.indianrail.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో దరఖాస్తుదారు తన ప్రాధాన్య భాషను ఎంపిక చేసుకుంటే ఎంచుకున్న భాషలో వెబ్‌పేజీ దర్శనమిస్తుంది.

railways-introduces-new-system-for-issue-of-passes-details-here

తరువాత దివ్యాంగుడి ఆధార్‌ నంబరు, పేరు, నమోదు చేయాలి. మొబైల్ నెంబర్ తో పాటుగా మరో ఫోన్ నెంబర్ ను జత చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇ-మెయిల్‌ ఐడీ, అలాగే పూర్తి పోస్టల్‌ చిరునామ సమర్పించాలి. దరఖాస్తు సమర్పించడానికి ముందు కన్సెషన్‌ సర్టిఫికెట్, సదరమ్‌ సర్టిఫికెట్, ఆధార్‌ కార్డు, దరఖాస్తుదారుడి ఫోటో, పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో సిద్ధం చేసుకుని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. సమర్పించిన దరఖాస్తును అధికారులు పరిశీలించి అప్రూవల్‌ చేసిన 30 నుంచి 45 రోజుల వ్యవధిలో దివ్యాంగజన్‌ రైల్వే రాయితీ ఫొటో గుర్తింపు కార్డు ముద్రితమై సమీప రైల్వే స్టేషన్‌కు వస్తుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+