జనం నిలదీశారు, పార్టీని మోసం చేశావ్, రాజగోపాల్ రెడ్డిపై జగదీశ్ ఫైర్

మునుగోడులో ధర్మమే గెలిచిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీగా ఉన్నారు. ఎన్నికకు సంబంధించి అన్నీ, తానై చూసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధర్మమే గెలిచిందన్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు. గెలిచింది ధర్మమేనని.. కేసీఆర్ నాయకత్వాన్ని.. దేశం కోరుకుంటుందని తెలిపారు. ఈ స్థాయిలో ఓటింగ్ ఎప్పుడూ జరగలేదని.. జనం తమకు బ్రహ్మారథం పట్టారని వివరించారు.

బీజేపీ కుట్ర, కుతంత్రం చేసిందని జగదీశ్ రెడ్డి విమర్శలు చేశారు. ఆ కుట్రలను ఛేదించి, తాము విజయం సాధించామని తెలిపారు. దేశంలో మోడీ దుర్మార్గాలు ఆపాలని తమకు మద్దతు ప్రకటించారని వివరించారు. ఈ విజయంతో మోడీ, బీజేపీ పతనం మొదలైందని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ప్రజలు కొత్త నేత కావాలని అనుకుంటున్నారని వివరించారు.

raja gopal reddy cheated peopel and party:jagadish reddy

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆదిలోనే జనం నుంచి రియాక్షన్ వచ్చిందని తెలిపారు. జనం నిలదీశారని వివరించారు. ప్రజలను మోసం చేశావు.. పార్టీని కూడా మోసం చేశావని అన్నారు. మరో పార్టీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. దానికి ఆయన వద్ద సమాధానం లేదన్నారు. వారు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు.

ఇచ్చిన హామీల అమలు కోసం పాడుపడతామని తెలిపారు.జిల్లా ఇంచార్జీ మంత్రిగా మునుగోడు అభివృద్దికి కట్టుబడి ఉన్నానని వివరించారు.కేసీఆర్ అభివృద్ధి మంత్రాన్ని మునుగోడు ప్రజలు విశ్వసించి.. తమకు పట్టం కట్టారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+