వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణాలో.. దమ్ముంటే ఆపాలని కేసీఆర్ కు రాజాసింగ్ సవాల్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణ రాష్ట్రంలోనూ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే కేసీఆర్ ను ఆపాలంటూ సవాల్ విసిరారు రాజాసింగ్. ప్రజలు ఎన్నుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలంటూ రాజాసింగ్ టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి, బిజెపి అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు అని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి పరిణామమే జరగబోతున్నది అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి చాలా ఎక్కువగా ఉందని, చాలామంది ఏకనాథ్ షిండేలు ఉన్నారని పేర్కొన్న రాజా సింగ్, తమ పదవులు ఉంటాయన్న నమ్మకం మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Raja Singh challenged KCR to stop what happened in Maharashtra will defenitely happen in Telangana

వారు పార్టీ నుండి ఏ క్షణంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఊహించని విధంగా వారంతా కేసీఆర్ కు షాక్ ఇచ్చే అవకాశం ఉందని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కెసిఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ భయం పట్టుకుందని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. అందుకే తెలంగాణకు మోడీ ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ఏవో పనులు కల్పించుకొని మొహం చాటేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు రెండేళ్లలో కేంద్రం ఇచ్చిన వరద సహాయాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో మహా వికాస అఘాడి కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసినట్లుగా, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమంటూ బీజేపీ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దమ్ముంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ కాపాడుకోవాలి అంటూ రాజాసింగ్ సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కెసీఆర్ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని రాజా సింగ్ పేర్కొన్నారు.

English summary
BJP MLA Rajasingh challenged KCR that what happened in Maharashtra is happening in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X