Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశ యువతకు రాజీవ్ గాంధీ ఐకాన్... ఆ పేరును మార్చడం దురదృష్టకరం... : రేవంత్ రెడ్డి

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ యువతకు ఐకాన్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేసింది రాజీవ్ గాంధే అన్నారు. యువతకు అవకాశాలు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని అన్నారు. దేశాభివృద్దిలో యువతదే ప్రధాన భూమిక అని రాజీవ్ గాంధీ విశ్వసించారన్నారు. రాజీవ్ గాంధీ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో జరిగిన జయంతి వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు.

రాజీవ్ మంత్రివర్గంలో 40శాతం యువతకు అవకాశం ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. దేశ యువతకు ఇంత స్పూర్తినిచ్చిన నేత పేరిట ఏర్పాటు చేసిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రభుత్వం తొలగించడం దురదృష్టకరమన్నారు. గాంధీ కుటుంబంపై కేంద్రం కక్ష సాధిస్తోందని ఆరోపించారు.

rajiv gandhi youth icon of the country renaming khel ratna award is unfortunate says revanth reddy

రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చడం బీజేపీ, మోదీ సంకుచిత బుద్ధికి నిదర్శనమని గతంలోనూ రేవంత్ విమర్శలు గుప్పించారు. యువతను అన్ని రంగాలలో ప్రోత్సహించి దేశంలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన స్వర్గీయ రాజీవ్ గాంధీ పేరును ఖేల్ రత్నగా ఉండడం సముచితమని పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మార్చుకొని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని.. ఆయన చేసిన సేవలు మరువలేనివని టీపీసీసీ చీఫ్ ప్రశంసించారు.

క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారంగా కేంద్రం ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. గాంధీ కుటుంబంపై ఉన్న కక్షతోనే పేరు మార్చారని సీనియర్ నేత వీహెచ్ తదితరులు విమర్శించారు.

కాగా,మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ 77వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్​, అధిర్​ రంజన్​ చౌదరీ ఢిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి రాజీవ్ గాంధీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+