నిజామాబాద్ సభలో రాజ్‌నాథ్ సింగ్: కెసిఆర్‌కు షాక్.. బిజెపిలో చేరిన డిఎస్ కొడుకు

Posted By:
Subscribe to Oneindia Telugu

నిజామాబాద్: సెప్టెంబర్ 17 ప్రాధాన్యం తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ తెలుసునని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం అన్నారు. నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

ఏ శక్తి భారత్‌ను బలహీనపర్చలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి మంత్రులు జైలుకు పోయారన్నారు. మోడీ కేబినెట్లో ఒక్క మంత్రిపై అవినీతి ఆరోపణలు లేవన్నారు.

ఐదేళ్లలో ఉగ్రవాదం, నక్సలిజం అంతం చేస్తామన్నారు. బ్రిటిష్ వాళ్లు దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించారని, కానీ అందరూ ఏకమై తరిమి కొట్టారని, తద్వారా ఐకమత్యం ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పామన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు విముక్తి కల్పించారన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ తెలంగాణ విమోచన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 Rajnath Singh hold public meeting at Nizamabad, TRS leader DS son join's BJP

అంతకుముందు దత్తాత్రేయ మాట్లాడారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి విమోచన దినంపై వ్యాఖ్యలు సరికాదన్నారు. వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. 2019లో బిజెపి అధికారంలోకి వస్తుందని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తామన్నారు.

బిజెపిలో చేరిన డిఎస్ తనయుడు

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేత డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో బిజెపిలో చేరారు. ఆయనతో పాటు పారిశ్రామికవేత్త సదానంద రెడ్డి, కాంగ్రెస్ నేత లక్ష్మీనర్సింహయ్య కమలం పార్టీలో చేరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajnath Singh hold public meeting at Nizamabad, TRS leader DS son join's BJP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X