రాజ్యసభ ఎన్నికలు, కాంగ్రెస్‌కు చేదు: మూడు స్థానాలు గెలిచిన టీఆర్ఎస్, వీరే
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడు సీట్లు కైవసం చేసుకుంది. మూడు స్థానాలకు గాను నలుగురు బరిలో నిలిచారు.
ముగ్గురు టీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్‌కు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి.

టీఆర్ఎస్ అభ్యర్థులు సంతోష్ కుమార్ (32 ఓట్లు), బడుగల లింగయ్య యాదవ్ (32 ఓట్లు), బండ ప్రకాశ్‍లు (33 ఓట్లు) గెలుపొందారు. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి గత నాలుగేళ్లుగా పలువురు తెరాసలో చేరారు. వారు అందరూ అధికార పార్టీ అభ్యర్థులకే ఓటేశారు.












Click it and Unblock the Notifications