Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిగ్ షాక్: సీఎం కేసీఆర్ రైతు ద్రోహి; టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్: రాకేష్ టికాయత్ సంచలనం

భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు (బికెయు) రాకేష్ టికాయత్ గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, ఆయన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) భారతీయ జనతా పార్టీ "బీ టీమ్" అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 కేసీఆర్ పై విరుచుకుపడ్డ రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్

కేసీఆర్ పై విరుచుకుపడ్డ రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్

కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ప్రారంభించిన ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఏ ఐ కె ఎస్ సి సి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే . రైతు ఉద్యమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో జరిగిన 'మహా ధర్నా'లో ప్రసంగించిన రాకేష్ టికాయత్ , కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ బిజెపి 'బీ' టీమ్ అని పేర్కొన్న ఆయన, బిజెపికి సహాయం చేయడానికి వెళ్లకుండా కెసిఆర్ ను కట్టి పడేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రైతు ఉద్యమం పై కేసీఆర్ స్పష్టమైన వైఖరి తెలియజెయ్యాలి

రైతు ఉద్యమం పై కేసీఆర్ స్పష్టమైన వైఖరి తెలియజెయ్యాలి

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఘాటుగా కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. రైతు ఉద్యమంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు రాకేష్ టికాయత్. అంతకుముందు, సెప్టెంబర్‌లో, టికాయత్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని బీజేపీ 'చాచా జాన్' అని పిలిచి టార్గెట్ చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత, బీజేపీ ఒక జట్టుగా ఉన్నాయని, వారి ఎత్తుగడలను రైతులు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఆరోపించారు. అటు ఎంఐఎం పార్టీని నమ్మే వీలు లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ను అసలే నమ్మొద్దని పేర్కొన్నారు.

అప్పుల బాధతో చనిపోయిన తెలంగాణా రైతుల సంగతి చెప్పు కేసీఆర్

అప్పుల బాధతో చనిపోయిన తెలంగాణా రైతుల సంగతి చెప్పు కేసీఆర్

రైతాంగ ఆందోళనకు ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) హైదరాబాద్‌లో 'మహా ధర్నా'లో ఆయన చేసిన షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన ప్రతి రైతుకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఇటీవల కేసీఆర్‌ చేసిన ప్రకటనపై రాకేష్‌ టికాయత్‌ తన ప్రసంగంలో ప్రశ్నించారు. అప్పుల బాధతో చనిపోతున్న తెలంగాణ రైతుల సంగతేంటి? అని రైతు నాయకుడు రాకేష్ టికాయత్ సీఎం కేసీఆర్ ను సూటిగా నిలదీశారు.

Recommended Video

    CM Jagan భారీ స్కెచ్.. AP Capital అభివృద్ధి కోసం 50 వేల కోట్ల రుణం! || Oneindia Telugu
    భాషలు వేరైనా రైతుల స్ఫూర్తి ఒక్కటే అన్న రాకేష్ టికాయత్

    భాషలు వేరైనా రైతుల స్ఫూర్తి ఒక్కటే అన్న రాకేష్ టికాయత్

    రాష్ట్రంలోని రైతులను ఆందోళనకు గురిచేస్తున్న వరి ధాన్యం కొనుగోళ్లపై వ్యాఖ్యానిస్తూ కేంద్రం పార్లమెంట్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టం చేసినప్పుడే తెలంగాణ రైతులకు వరిసాగు లాభిస్తుందని రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మాట్లాడే భాషలు వేరైనప్పటికీ రైతుల స్ఫూర్తి ఒక్కటేనని, వారి పోరాటం కూడా అంతేనని అన్నారు. రైతులు రాజకీయ నాయకుల మాయ మాటలు నమ్మకుండా సమస్యలపై పోరాటం చెయ్యాలన్నారు. రైతులు ఇళ్లకు తిరిగి వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును కూడా కాదన్న రైతు సంఘం నాయకులు రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+