Ram gopal varma: వరంగల్ సీక్రెట్ టూర్, ఎల్బీ కళాశాల విజిట్ వెనుక .. కొండా మురళి బయోపిక్ !!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త వివాదానికి తెర తీయబోతున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో వర్మ చేస్తున్న పోస్టులే కాకుండా, ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ చేస్తున్న ఇంటర్వ్యూలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని పక్కన పెడితే, రాంగోపాల్ వర్మ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎలాంటి సంశయం లేకుండా నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. ఇక అలాంటి రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనం అనే చెప్పాలి. ఇక తాజాగా రాంగోపాల్ వర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ సినిమా కోసం రాంగోపాల్ వర్మ వరంగల్ జిల్లా లో సీక్రెట్ గా పర్యటిస్తున్నారు.

ఎల్బీ కళాశాలను సందర్శించిన వర్మ.. అధ్యాపకులతో సీక్రెట్ మీటింగ్
ఇప్పటికే పలువురి బయోపిక్ ల పేరుతో సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ, మరో బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు . తాను తీయబోయే బయోపిక్ కోసం తాజాగా ఎల్బీ కళాశాలలో సిబ్బందిని అలాగే అధ్యాపకులను కలిసి కొంతసేపు రహస్యంగా ఆయన చర్చించారు. ఎల్బీ కళాశాలకు సంబంధించిన అనేక అంశాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు.ఎల్బీ కళాశాల ప్రిన్సిపాల్ డీహెచ్ అరుణ రావుతో సమావేశమై అనేక విషయాలను చర్చించారు. కళాశాల అంతా తిరిగి చూశారు.

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ బయోపిక్ తీయనున్న రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ బయోపిక్ తీయబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బయోపిక్ చేయనున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఎల్బీ కళాశాలకు వెళ్లి అక్కడ అధ్యాపకులతో మాట్లాడారు. కొండ మురళి, కొండా సురేఖ దంపతులు ఎల్బీ కళాశాలలో చదువుకున్న వారు కావడం, వారిద్దరి ప్రేమ ఎల్బీ కళాశాలలోనే ప్రారంభం కావడంతో వర్మ తాను తీయబోతున్న సినిమా కోసం కళాశాలలోని నాటి అధ్యాపకులను వారు ఎలా ఉండేవారు అన్న దానిపై ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. కొండా సురేఖ, కొండా మురళికి సంబంధించి విద్యాభ్యాసం వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

కొండా మురళి బయోపిక్ తో ఏం కాంట్రవర్సీ సృష్టించబోతున్నారు?
ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా సినిమాలు తీయడం రాంగోపాల్ వర్మకు చేతగాని పని. మరి కొండా సురేఖ, కొండా మురళి దంపతులపై వర్మ తీస్తున్న బయోపిక్ ఎలా ఉండబోతుంది? ఎన్ని కాంట్రవర్సీ లకు కారణం అవుతుంది ? అసలు వర్మ కొండ మురళి బయోపిక్ తీస్తున్న లైన్ ఏంటి? వర్మ దృష్టి కొండా దంపతులపై ఎందుకు పడింది ?వర్మ తీస్తుంది కొండా సురేఖ మురళిల ప్రేమ కథనా ? లేక కొండ మురళి దంపతుల రాజకీయ ప్రయాణమా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా రాంగోపాల్ వర్మ కొండా మురళి మీద తీస్తున్న బయోపిక్ ఎంత కాంట్రవర్సీ సృష్టించబోతుందో అన్న చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Recommended Video

తెలంగాణా రాజకీయాల్లో కొండా దంపతుల ప్రస్థానం ప్రత్యేకం
తెలంగాణా రాజకీయాల్లో కొండా దంపతుల ప్రస్తానం ఇప్పటివరకు ఆసక్తికరంగానే సాగింది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన సురేఖ వైఎస్ హయాంలో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. వైఎస్ మరణం తర్వాత జగన్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫైర్ బ్రాండ్ సురేఖ తెలంగాణా ఉద్యమ సమయంలో కేసీఆర్ ను హరీష్ రావును తిట్టి రాజకీయాల్లో సంచలనం రేపారు. అయితే తెలంగాణలో వైసీపీకి పట్టు లేకపోవటంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మళ్ళీ కాంగ్రెస్ నుండి అదే టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయాలను సాగించారు. టీఆర్ఎస్ నుండి వరంగల్ ఎమ్మెల్యేగా సురేఖ 2014ఎన్నికల్లో విజయం సాధించారు.గత ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినాయత్వం పట్ల మళ్ళీ అదే ధిక్కార స్వరాన్ని వినిపించి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి ఓటమి పాలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల నేపధ్యంలో కొండా సురేఖ పేరు రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications